ఆటో డ్రైవర్‌తో ఇద్దరు యువతుల ఫైటింగ్.. బెంగళూరు వీడియో వైరల్..
ABN , Publish Date - Sep 29 , 2026 | 07:24 PM
బెంగళూరులో ఆటో చార్జీ విషయంలో జరిగిన గొడవ తీవ్ర రూపం దాల్చింది. ఇద్దరు మహిళలు, ఓ ఆటో డ్రైవర్ మధ్య రోడ్డుపైనే వాగ్వాదం మొదలైంది. చివరకు ఒకరినొకరు తోసుకుంటూ, కొట్టుకునే వరకు వెళ్లింది.
ఇంటర్నెట్ డెస్క్: బెంగళూరులో ఆటో చార్జీ విషయంలో జరిగిన గొడవ తీవ్ర రూపం దాల్చింది. ఇద్దరు మహిళలు, ఓ ఆటో డ్రైవర్ మధ్య రోడ్డుపైనే వాగ్వాదం మొదలైంది. చివరకు ఒకరినొకరు తోసుకుంటూ, కొట్టుకునే వరకు వెళ్లింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఅవుట్ 3వ సెక్టార్‌లో సోమవారం మధ్యాహ్నం జరిగింది (Bengaluru auto driver fight).
ప్రయాణ చార్జీ విషయంలో మహిళలు, ఆటో డ్రైవర్ మధ్య వాగ్వాదం మొదలైనట్టు పోలీసులు తెలిపారు. మాటామాటా పెరగడంతో పరిస్థితి అదుపు తప్పింది. రోడ్డుపైనే ముగ్గురూ పరస్పరం తోసుకోవడం, కొట్టుకోవడం వీడియోలో కనిపించింది. గొడవను గమనించిన మరో మహిళ మధ్యలోకి వచ్చి వారిని విడదీసే ప్రయత్నం చేసింది. చివరకు ఆమె జోక్యంతో పరిస్థితి సద్దుమణిగింది. ఈ ఘటనను అక్కడే ఉన్న ఓ వ్యక్తి తన మొబైల్ ఫోన్‌లో రికార్డు చేశారు. ఆ తర్వాత వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది (Two women auto driver fight).
ఆ ఆటోడ్రైవర్‌పై ఆ మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆటో డ్రైవర్‌ను గుర్తించిన పోలీసులు ఘటనకు దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు ప్రారంభించారు (Bengaluru viral video). మహిళలు ప్రయాణ చార్జీ చెల్లించేందుకు నిరాకరించడంతో గొడవ మొదలైందని ఆటో డ్రైవర్ చెబుతున్నాడు. ఈ మొత్తం వ్యవహారంపై పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. కాగా, బెంగళూరులో ఆటో చార్జీల విషయంలో ప్రయాణికులు, డ్రైవర్ల మధ్య గత కొంతకాలంగా వివాదాలు కొనసాగుతున్నాయి.
ఇవి కూడా చదవండి..
అథ్లెటిక్స్‌లో భారత్‌కు తొలి స్వర్ణం.. 4x400 మీటర్ల రిలేలో అదరగొట్టిన అమ్మాయిలు..
శ్రీ చరణి సంచలనం.. అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించి రికార్డ్..