Share News

ఆటోవాలా చేసేందేంటో అర్థంకాక డౌట్.. కొన్ని క్షణాలకు విషయం తెలిసి..

ABN , Publish Date - Aug 24 , 2026 | 04:33 PM

బెంగళూరులోని ఓ ఆటోవాలా సహృదయత ప్రస్తుతం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

ఆటోవాలా చేసేందేంటో అర్థంకాక డౌట్.. కొన్ని క్షణాలకు విషయం తెలిసి..
Bengaluru auto driver viral video

ఇంటర్నెట్ డెస్క్: రెండు చేతులతో అర్థించినా సాయం చేయని జనాలున్న ప్రపంచంలో ఎలాంటి లాభాపేక్ష లేకుండా అవతలి వారిని ఆదుకునే వారూ ఉంటుంటారు. ఇలాంటి వారి ఉదంతాలు అప్పుడప్పుడూ నెట్టింట వైరల్ అవుతూ జనాలకు సాంత్వన కలిగిస్తుంటాయి. మానవత్వంపై నమ్మకం కలిగిస్తుంటాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి నెట్టింట ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఈ వీడియోలోని ఆటోవాలాపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. బెంగళూరులో ఈ ఘటన వెలుగు చూసింది. చేతనా సరాఫ్ ఈ వీడియోను షేర్ చేసింది. తన ఫ్రెండ్స్‌తో కలిసి ఆటోలో వెళుతుండగా ఆటోవాలా తీరు తమను ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పింది.


వీడియోలో కనిపించిన దాని ప్రకారం, రోడ్డుపై తన స్కూటీ మీద మెల్లగా వెళుతున్న ఓ యువతి పక్కగా ఆటోవాలా తన వాహనాన్ని డ్రైవ్‌ చేశాడు. అలా ఎందుకు చేస్తున్నాడో అర్థం కాక ఆటోలోని యువతులు తొలుత ఆశ్చర్యపోయారు. ఆ తరువాత కొన్ని క్షణాలకే విషయం అర్థమైంది. డ్రైవర్ ఆటోలో కూర్చునే తన కాలిని స్కూటీపై పెట్టి ముందుకు నెట్టాడు. ఇలా దాదాపు 10-15 నిమిషాల పాటు సాగింది.

స్కూటీని ముందుకు నెట్టేందుకు ఆ ఆటోవాలా తాను చేయగలిగిందంతా చేశాడు. చివరకు ఆమె మెకానిక్‌ను చేరుకునే వరకూ స్కూటీని నెట్టాడు. ఆటోవాలా చేసిన సాయానికి ఆటోలోని యువతి సంబరపడింది. అతడి మంచితనాన్ని ప్రపంచం గుర్తించాలనే ఉద్దేశంతోనే ఈ వీడియోను నెట్టింట షేర్ చేస్తున్నానని తెలిపింది. ఉబెర్ ఇండియా సంస్థను కూడా ట్యాగ్ చేసింది. ఆ ఆటోడ్రైవర్ పేరు తన్జీమ్ అని కూడా తెలిపింది.


ఈ వీడియోపై జనాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. అనేక మంది ఆటోవాలాను ప్రశంసించారు. మంచి వ్యక్తిగా, బాధ్యతాయుతమైన పౌరుడిగా నిలిచాడని అన్నారు. జనాలు స్వీయప్రయోజనాలకే పరిమితమవుతున్న నేటి జమానాలో ఇలాంటి వారు కనబడటం నిజంగా మనసుకు సంతోషం కలిగిస్తుందని చెప్పారు.

ఈ వార్తలనూ చదవండి:

‘మనోళ్లకు కుళ్లు ఉంటుంది..’ ఎన్నారైలపై మరో భారతీయుడి విమర్శలు

రైల్వే బెడ్‌షీట్లతో షాపింగ్.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..

Updated Date - Aug 24 , 2026 | 04:51 PM