Bengaluru Aerial View: అద్భుతం.. 27వ అంతస్తు నుంచి చూసే.. నెట్టింట వైరల్‌గా మారిన వీడియో
ABN , Publish Date - Jan 15 , 2026 | 04:36 PM
27వ అంతస్తు నుంచి బెంగళూరు నగరం ఎలా కనిపిస్తోందో చెబుతూ ఓ వ్యక్తి షేర్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. ‘అలజడికి అందనంత ఎత్తులో..’ అన్న క్యాప్షన్‌తో షేర్ చేసిన వీడియో నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది.
ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లోని మెట్రోపాలిటన్ నగరాల్లో లైఫ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిజీ బిజీ బతుకులు, కాలుష్యం, ట్రాఫిక్ చిక్కులు.. ఇలా చెప్పుకుంటూ లిస్టు చాలా పెద్దదే అవుతుంది. కానీ ఈ రణగొణ ధ్వనులకు అందనంత ఎత్తులో ఉన్నామంటూ ఓ మహిళా టెకీ పెట్టిన పోస్టు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది (Bengaluru High Rise Apartment Viral View).
భావన గుప్తా అనే మహిళ ఈ పోస్టును షేర్ చేశారు. తాను బెంగళూరులోని ఓ ఆకాశహర్మ్యంలోని 27 అంతస్తులో ఉంటున్నట్టు చెప్పుకొచ్చారు. నగర జీవితంలో చిక్కులకు అందనంత ఎత్తున ఉన్నట్టు చెప్పుకొచ్చారు. వీడియోను కూడా షేర్ చేశారు.
వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఆమె తన గది కిటికీ తలుపులు తెరవగానే అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది. కనుచూపు మేర అంతా దట్టమైన మేఘాలు, వాటిల్లోంచి పొడుచుకు వచ్చినట్టు ఉన్న అపార్ట్‌మెంట్‌లు అద్భుత దృశ్యం కళ్లముందు సాక్షాత్కారమైంది. బెంగళూరు ట్రాఫిక్ చప్పుళ్లు, వాహనాలు మాత్రం కానరాలేదు. నగరమంతా మంచుదుప్పటి మాటున ప్రశాంతంగా కనిపించింది. 27వ అంతస్తు నుంచి చూస్తే లైఫ్ ఇలా కనిపిస్తుందన్న క్యాప్షన్‌తో ఆమె ఈ వీడియోను షేర్ చేశారు. అలజడికి అందనంత దూరంలో ఉన్నామని కామెంట్ చేశారు.
బెంగళూరు జీవితంలోని మరో పార్శ్వాన్ని చూపించిన ఈ వీడియో సహజంగానే నెట్టింట వైరల్‌గా మారింది. అనేక మంది కామెంట్స్ వరద పారించారు. ఈ దృశ్యం అస్సలు నమ్మశక్యంగా లేదని కొందరు అన్నారు. ఉదయాన్నే ఇలాంటి దృశ్యం మనసును ఆహ్లాదపరిచి నూతనోత్సాహాన్ని ఇస్తుందని అన్నారు.
భారతీయ సిలికాన్ వ్యాలీగా పేరు పడ్డ బెంగళూరు నగర ట్రాఫిక్ పేరు చెబితే అంతరిక్ష యాత్రలు చేసిన వారు కూడా బెదిరిపోతుంటారు. నగర జనాభా అభివృద్ధి చెందిన స్థాయిలో మౌలిక వసతుల రూపకల్పన జరగకపోవడంతో నగరవాసులు నిత్యం ఇక్కట్ల పాలవుతుంటారు. మరి ఇందుకు భిన్నమైన దృశ్యాన్ని ఆవిష్కరించిన ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి
ఇవీ చదవండి
తుపాను లాంటి భారతీయ రైలు.. అయినా తెరమరుగు.. ఈ చరిత్ర తెలిస్తే..
హనుమాన్ విగ్రహం చుట్టూ శునకం ప్రదక్షిణలు! 36 గంటల పాటు..