Share News

తల్లి రీల్స్ పిచ్చి.. చంటి బిడ్డను బ్రిడ్జిపై వదిలేసి..

ABN , Publish Date - Aug 10 , 2026 | 07:57 AM

రీల్స్ పిచ్చితో ఓ మహిళ తన చంటిబిడ్డ ప్రాణాలను ప్రమాదంలో పెట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు మహిళపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తల్లి రీల్స్ పిచ్చి.. చంటి బిడ్డను బ్రిడ్జిపై వదిలేసి..
viral baby video

ఇంటర్‌నెట్ డెస్క్: రీల్స్ పిచ్చితో ఓ మహిళ తన చంటిబిడ్డ ప్రాణాలను ప్రమాదంలో పెట్టింది. ఉత్తర భారత దేశానికి చెందిన ఓ మహిళ రీల్స్ కోసం తన బిడ్డను రోడ్డుపై వదిలేసింది. రోడ్డుమీద ఆమె డ్యాన్స్ చేస్తుండగా.. చిన్నారి పాక్కుంటూ రేలింగ్ దగ్గరకు వచ్చింది. రేలింగ్ సందులో దూరే ప్రయత్నం చేసింది. అలా జరిగి ఉంటే పాప బ్రిడ్జిపై నుంచి నీటిలో పడిపోయేది. అక్కడే ఉన్న ఓ వ్యక్తి పరుగున చిన్నారి దగ్గరకు వచ్చాడు. చిన్నారిని వెంటనే అక్కడినుంచి పక్కకు తీసుకువచ్చాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది.


ఈ సంఘటన ఎప్పుడు జరిగింది? ఆమె ఎవరు? అన్నది తెలియరాలేదు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు మహిళపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘రీల్స్ అంటే అంత పిచ్చి ఉంటే.. పెళ్లి చేసుకోవటం ఎందుకు? పిల్లల్ని కనటం ఎందుకు? కొంచెం కూడా బాధ్యత లేదు’.. ‘ఛీ ఇలాంటి వాళ్ల వల్లే పిల్లలు దారుణంగా తయారు అవుతున్నారు’..‘కొన్ని లైక్స్ కోసం.. వ్యూస్ కోసం కన్నబిడ్డ ప్రాణాలను రిస్క్‌లో పెడతావా? నువ్వసలు తల్లివేనా’..‘దీన్నే కొంతమంది సెల్ఫ్ లవ్ అని చెప్పుకుని తిరుగుతున్నారు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

ఒక దళిత పెన్షనర్ డైరీ

పగిలిన పల్లె పాదాలు

Updated Date - Aug 10 , 2026 | 08:23 AM