Share News

ఇలా జరిగిందేంటి.. మరీ ఇంత ఈజీగా దొంగతనం చేయొచ్చా?..

ABN , Publish Date - Apr 03 , 2026 | 10:56 AM

ఓ మహిళ పట్టపగలు నగల దుకాణంలో దొంగతనం చేసింది. అది కూడా ఎలాంటి గొడవలు లేకుండా సింపుల్‌గా బంగారు నగను తీసుకెళ్లిపోయింది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో గురువారం చోటుచేసుకుంది.

ఇలా జరిగిందేంటి.. మరీ ఇంత ఈజీగా దొంగతనం చేయొచ్చా?..
ayodhya robbery

ఇంటర్‌నెట్ డెస్క్: ఓ మహిళ పట్టపగలు నగల దుకాణంలో దొంగతనం చేసింది. అది కూడా ఎలాంటి గొడవలు లేకుండా సింపుల్‌గా బంగారు నగను తీసుకెళ్లిపోయింది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో గురువారం చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. అయోధ్య, రుదౌలీ పోలీస్ స్టేషన్‌ పరిధిలోని అగర్వాల్ కాంప్లెక్స్‌లో ఓ బంగారు నగల షాపు ఉంది. గురువారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో బుర్ఖా ధరించిన ఓ మహిళ ఆ షాపునకు వచ్చింది. బంగారు నగలు చూపించమని అడిగింది. షాపు యజమాని చాలా నగల్ని చూపించాడు.


ఆమె ఓ నగను ఎంపిక చేసుకుంది. అయితే, పేమెంట్ విషయంలో ఆలస్యం చేయసాగింది. పైకి లేచి కొద్దిసేపు అటు, ఇటు తిరిగింది. షాపు యజమాని కౌంటర్ దగ్గరినుంచి కొంచెం పక్కకు వెళ్లగానే దొంగతనానికి పాల్పడింది. కౌంటర్ మీద ఉంచిన బంగారు నగని చేతుల్లోకి తీసుకొని పారిపోయింది. తనను ఎవరూ అడ్డుకోకుండా ఉండేందుకు గన్‌ను బయటకు తీసి బెదిరించింది. అయితే, ఆమె ఏ ఆటంకం లేకుండానే అక్కడినుంచి ఈజీగా.. క్షణాల్లో తప్పించుకుని పారిపోయింది. షాపు యజమాని, మరో వ్యక్తి ఆమె వెనకాలే పరుగులు తీశారు.


మహిళ దొంగతనం చేసిన నగ బరువు 26 గ్రాములు ఉంటుందని సమాచారం. షాపు యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితురాలిని త్వరలోనే పట్టుకుంటామని అన్నారు. ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘దొంగతనం మరీ ఇంత ఈజీగా చేయొచ్చని నాకు తెలీదు’..‘దొంగతనం చేయడానికి సరైన షాపును ఎంచుకుంది. వాస్తవానికి తుపాకి కూడా అవసరం లేదు’ అని కామెంట్లు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

అభిషేక్ శర్మపై బీసీసీఐ సీరియస్.. మ్యాచ్ ఫీజులో కోత

మళ్లీ చిగురిస్తున్న ‘చేర్యాల’ ఆశలు!

Updated Date - Apr 03 , 2026 | 11:21 AM