Share News

మహిళ నుంచి రూ. 42 వేలు ఎత్తుకెళ్లిన కోతి.. చివరకు ఏమైందంటే..

ABN , Publish Date - Aug 19 , 2026 | 07:53 PM

మహిళ దగ్గరినుంచి 42 వేల రూపాయలను కోతి దొంగిలించిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

మహిళ నుంచి రూ. 42 వేలు ఎత్తుకెళ్లిన కోతి.. చివరకు ఏమైందంటే..
Ayodhya monkey steals cash

ఇంటర్‌నెట్ డెస్క్: మహిళ దగ్గరినుంచి 42 వేల రూపాయలను కోతి దొంగిలించిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. అయోధ్యకు చెందిన అంజు దేవీ అనే మహిళ దగ్గరినుంచి ఓ కోతి 42,105 రూపాయలను లాక్కుంది. మహిళ ఎంత ప్రయత్నించినా కోతి డబ్బుల్ని విడిచి పెట్టలేదు. ఈ విషయం స్థానిక పోలీసులకు తెలిసింది. సబ్ ఇన్‌స్పెక్టర్ అశోక్ కుమార్, సబ్ ఇన్‌స్పెక్టర్ పంకజ్ సింగ్, హెడ్ కానిస్టేబుల్ కులదీప్ యాదవ్, కానిస్టేబుల్ అంకిత్ వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లారు.


కోతినుంచి డబ్బుల్ని విడిపించడానికి ప్రయత్నించారు. కోతిని భయపెట్టకుండా అరటిపళ్లు ఇచ్చారు. ఆ కోతి డబ్బులను వదిలేసి అరటిపళ్లు తినటంలో బిజీ అయిపోయింది. ఈ సమయంలో పోలీసులు డబ్బులను తీసుకున్నారు. ఆ డబ్బులను అంజు దేవీకి అందజేశారు. దీంతో ఆమె ఎంతో సంతోషించింది. తన డబ్బులను తిరిగి తీసుకువచ్చిన పోలీసులకు ధన్యవాదాలు తెలియజేసింది. ఇక, ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


ఇవి కూడా చదవండి

టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై అరెస్ట్ వారెంట్..

కొండా సుస్మిత వ్యవహారంపై టీపీసీసీ సీరియస్

Updated Date - Aug 19 , 2026 | 08:25 PM