ఫ్రెండ్స్ వద్దంటున్నా భారత్‌కు వచ్చిన ఆస్ట్రేలియా యువతి! చివరకు..
ABN , Publish Date - Mar 01 , 2026 | 09:22 PM
ఫ్రెండ్స్ వద్దంటున్నా వినకుండా భారత్‌కు వచ్చిన ఒక ఆస్ట్రేలియా యువతి తాజాగా తన అనుభవాన్ని నెట్టింట పంచుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: ఫ్రెండ్స్ వద్దంటున్నా వినకుండా భారత్‌కు వచ్చిన ఒక ఆస్ట్రేలియా యువతి ఇక్కడి వారు ఇచ్చిన ఆతిథ్యం చూసి అబ్బురపడింది. భారత్ అంటే ఇదా! అంటూ ఆశ్చర్యపోయింది. అసలు ఏం జరిగిందో చెబుతూ ఆమె షేర్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
బెక్ మెక్‌కాల్ అనే ఆస్ట్రేలియన్ ఈ వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ‘నాకు అంతా తికమకగా ఉంది. అక్కడకు వెళ్లొద్దంటూ జనాలు పదే పదే హెచ్చరించిన భారత్ ఇదేనా? ఇక్కడకు వచ్చే ముందు భారత్ గురించి రకరకాల వదంతులు విన్నాను. భయం గొలిపే కథనాలు నా చెవిన పడ్డాయి. కానీ వీటికి భిన్నమైన వాస్తవాన్ని నేను ప్రత్యక్షంగా చూశాను. ఇక్కడి వారి ఆతిథ్యం, ఆత్మీయత, ఉదారత, స్నేహశీలత నన్ను కట్టిపడేశాయి’ అని ఆమె చెప్పుకొచ్చింది.
ఉదయ్‌పూర్, పుష్కర్, గుజరాత్‌లోని పలు ప్రాంతాలు, ముంబైలోని ధరావీ మురికి వాడ.. ఇలా తాను సందర్శించిన పలు ప్రాంతాల వీడియోలను ఆమె నెట్టింట పంచుకుంది. తాను ఎక్కడికెళ్లినా అద్భుతమైన ఆతిథ్యమే ఎదురైందని వ్యాఖ్యానించింది. స్థానిక కుటుంబాలతో కలిసి టీ తాగానని తెలిపింది. కొత్త ప్రదేశాల్లో తనకు అపరిచితులు ఎంతో సహృదయతతో సాయపడ్డారని పేర్కొంది.
‘కొత్త ప్రదేశాలకు ప్రయాణాలు మనకు ఎన్నో విశేషాలు తెలియజెబుతాయి. బయటకాలు కూడా పెట్టని వారే కొత్త ప్రదేశాల గురించి చెడు ప్రచారాన్ని చేస్తుంటారు. ఇది మనందరికీ ఒక గుణపాఠం కావాలి. ఎలాంటి సంకోచాలు లేకుండా టూర్‌లు చేపట్టండి. మీ అనుభవాలే మీకు మార్గదర్శకంగా నిలుస్తాయి’ అని ఆమె తన పోస్టులో కామెంట్ చేశారు.
ఈ వార్తలూ చదవండి:
82 ఏళ్ల వృద్ధురాలికి పైబెర్తు కేటాయింపు! స్పందించిన రైల్వే
అయ్యో పాపం.. ఊరేగింపులో ఏనుగును సిద్ధం చేస్తుండగా ఏమైందో చూడండి..