Share News

భారత్‌లో ఫ్రెండ్‌షిప్స్‌పై ఆస్ట్రేలియా వ్యక్తి ఆశ్చర్యం! ఇలాంటిది మా దేశంలో లేదంటూ..

ABN , Publish Date - Jan 25 , 2026 | 02:13 PM

భారతీయ స్నేహ బంధాల్లో గాఢత ఎక్కువంటూ ఓ ఆస్ట్రేలియన్ చేసిన కామెంట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇది నిజమేనని ఫారినర్లు అనేక మంది అభిప్రాయపడ్డారు.

భారత్‌లో ఫ్రెండ్‌షిప్స్‌పై ఆస్ట్రేలియా వ్యక్తి ఆశ్చర్యం! ఇలాంటిది మా దేశంలో లేదంటూ..
Australian on Friendships in India

ఇంటర్నెట్ డెస్క్: భారతీయుల స్నేహబంధాల్లో గాఢత ఎక్కువంటూ ఓ ఆస్ట్రేలియా వ్యక్తి పెట్టిన పోస్టు ప్రస్తుతం నెట్టింట జనాల్ని అమితంగా ఆకట్టుకుంటోంది. ఆండీ ఇవాన్స్ అనే ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇక్కడి బంధాల్లో గాఢత, నిజాయతీ ఎక్కువని చెప్పుకొచ్చాడు (Australian on Friendships in India).

‘ఈ విషయం అర్థం చేసుకునేందుకు నాకు కాస్త సమయం పట్టింది. భారతీయులు తమ స్నేహితుల విజయాల్ని గర్వంగా చెప్పుకుంటారు. వారితో కలిసి సంబరం చేసుకుంటారు. ఇక్కడి వారు తమ ఫ్రెండ్స్ జీవితాల్లోని ముఖ్య ఘట్టాల చిత్రాలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. ఇండియాకు వచ్చే వరకూ ఇలాంటిది నా జీవితంలో ఎన్నడూ చూడలేదు’ అని చెప్పుకొచ్చాడు.


ఈ పోస్టుకు నెట్టింట భారీ స్పందన వచ్చింది. ఒక లక్షకు పైగా వ్యూస్, వేలల్లో లైక్స్ వచ్చాయి. ఈ పోస్టుపై ఫారినర్లు కూడా స్పందించారు. భారతీయుల్లో ఈ తీరును తాము గమనించానని కొందరు చెప్పుకొచ్చారు. ‘ఒక అమెరికన్‌గా నేను అవతలి వారు విజయం సాధించినప్పుడు శుభాకాంక్షలు చెబుతాను. అంతేకానీ, దాని గురించి అందరికీ గొప్పగా చెప్పను. మరీ క్లోజ్ అయితే తప్ప ఇలా చేయను. సోషల్ మీడియాలో పోస్టులు గట్రా పెట్టను’ అని ఒక వ్యక్తి అన్నారు.

భారత్‌లో ఇది సర్వసాధారణ విషయమని అనేక మంది ఇండియన్స్ కామెంట్ చేశారు. ఇతర దేశాల్లో కూడా ఇలాగే జరుగుతుందని తాను ఇప్పటివరకూ అనుకున్నానని మరొక వ్యక్తి చెప్పుకొచ్చారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య తెగ వైరల్ అవుతున్న ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.


ఇవీ చదవండి:

షాకింగ్! వందే భారత్‌ను టార్గెట్‌ చేసి.. పట్టాలపై చెక్క దుంగలను పెట్టి..

20ల్లో ఉండగానే జాబ్‌కు యువకుడి రాజీనామా! ఏఐ వచ్చేసిందంటూ వార్నింగ్

Updated Date - Jan 25 , 2026 | 02:19 PM