పాకిస్థాన్ వ్యక్తితో అమెరికా యువతి పెళ్లి.. ఇక నీ జీవితం నరకమే!!..
ABN , Publish Date - Feb 22 , 2026 | 03:16 PM
అమెరికాకు చెందిన టేలర్ అనే యువతి పాకిస్థాన్‌కు చెందిన ఓ యువకుడిని ప్రేమించింది. అతడి కోసం అమెరికా నుంచి పాకిస్థాన్ వచ్చేసింది. అతడిని పెళ్లి చేసుకుని పాకిస్థాన్‌లోని ఓ కుగ్రామంలో స్థిరపడిపోయింది..
ఇంటర్‌నెట్ డెస్క్: అమెరికాలో డబ్బున్న వారి జీవితం ఎంత లగ్జరీగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అక్కడ జీవితానికి అలవాటు పడితే బయటి దేశాల్లో బతకటం చాలా కష్టం. అలాంటిది.. అమెరికాకు చెందిన వాళ్లు పాకిస్థాన్‌లాంటి నిరుపేద దేశంలో జీవించాల్సి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించటం కష్టమే. ఈ స్టోరీలో.. అమెరికాకు చెందిన టేలర్ అనే యువతి పాకిస్థాన్‌కు చెందిన ఓ యువకుడిని ప్రేమించింది. అతడి కోసం అమెరికా నుంచి పాకిస్థాన్ వచ్చేసింది. అతడిని పెళ్లి చేసుకుని పాకిస్థాన్‌లోని ఓ కుగ్రామంలో స్థిరపడిపోయింది.
తన నిత్య జీవితం గురించి వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంది. తాజాగా, పాకిస్థాన్‌లో తన పరిస్థితి చెబుతూ ఓ వీడియో చేసింది. ఆ వీడియోలో పల్లెటూరి జీవితం గురించి చెప్పుకొచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ వీడియోను పోస్ట్ చేసింది. ‘నేను పాకిస్థాన్‌కు వస్తానని అస్సలు అనుకోలేదు. పాకిస్థాన్‌లో చాలా విషయాలు నచ్చుతున్నాయి. మీకు ఏ విషయం గురించి అయినా తెలుసుకోవాలని ఉంటే కామెంట్ చేయండి’ అని రాసుకొచ్చింది. ఆ వీడియో వైరల్‌గా మారింది. మిలియన్ల కొద్దీ వ్యూస్, లక్షల్లో లైక్స్ తెచ్చుకుంది.
ఇక, ఆ వీడియోపై ఏకంగా 11 వేల మంది కామెంట్లు చేశారు. ‘చూడ్డానికి చాలా దారుణంగా ఉంది. ఎంజాయ్ చేయ్’.. ‘ఆఖరికి పాకిస్థాన్ వాళ్లు కూడా అలాంటి లైఫ్ కావాలని కోరుకోరు’..‘నేనొక పాకిస్థాన్ యువతిని. ఈ తప్పు ఎందుకు చేశావ్’..‘ఇప్పుడు బానే ఉంటుంది. ఇక, నీ జీవితం నరకమే’..‘వెయ్యి తరాలకు చెందిన మీ పూర్వీకులు పైనుంచి ఇది చూస్తూ ఉంటారు. వాళ్లు కచ్చితంగా ఏడుస్తూ ఉంటారు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
శరద్ పవార్‌కు మళ్లీ అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు
నమో భారత్ ట్రైన్, మీరట్ మెట్రోను ప్రారంభించిన మోదీ