9 నెలల వెతుకులాట తరువాత జాబ్.. 2.5 గంటల్లో ఊస్టింగ్!
ABN , Publish Date - Sep 18 , 2026 | 09:57 PM
తొమ్మిది నెలల వెతుకులాట తరువాత అమెరికాలో ఓ వ్యక్తికి జాబ్ వచ్చింది. రాకరాక వచ్చిన ఉద్యోగం కేవలం 2.5 గంటల్లో కోల్పోవాల్సి రావడంతో ఆ వ్యక్తి దిమ్మతిరిగినంత పనైంది.
ఇంటర్నెట్ డెస్క్: తొమ్మిది నెలల వెతుకులాట తరువాత అమెరికాలో ఓ వ్యక్తికి జాబ్ వచ్చింది. రాకరాక వచ్చిన ఉద్యోగం కేవలం 2.5 గంటల్లో కోల్పోవాల్సి రావడంతో ఆ వ్యక్తి దిమ్మతిరిగినంత పనైంది. దీంతో, ఆ వ్యక్తి తన గోడును నెట్టింట వెళ్లబోసుకున్నాడు. జనాలు అతడికి సాంత్వన కలిగించే మాటలు చెప్పే ప్రయత్నం చేశారు.
అసలేం జరిగిందో చెబుతూ ఆ వ్యక్తి నెట్టింట పోస్టు పెట్టారు. జాబ్ వచ్చిందని తెలిశాక ఎంతో సంబరపడ్డానని అతడు చెప్పాడు. మొదటి రోజున ఎంతో ఉత్సాహంగా ఆఫీసుకు వెళ్లాలని చెప్పాడు. కొత్త దుస్తులు ధరించి నీట్‌గా తయారయ్యి వెళ్లినట్టు వివరించాడు. మొదట సూపర్‌వైజర్ తనకు ఆఫీసులో వివిధ విభాగాల గురించి పరిచయం చేశారని తెలిపారు. ఆ తరువాత ఉదయం 10.00 గంటలకు మరో వ్యక్తి వచ్చి ట్రెయినింగ్ ఇవ్వడం ప్రారంభించారని తెలిపారు.
ఆ తరువాత కాసేపటికి సూపర్‌వైజర్ వచ్చి తనను కాస్త ముందుగా లంచ్ బ్రేక్ తీసుకోమన్నారని వివరించారు. సూపర్‌వైజర్‌కు ఇతర పనులు ఉండటంతో లంచ్ తరువాత కూడా తాను మరి కాసేపు వేచి చూడాల్సి వచ్చిందని చెప్పాడు. ఆ తరువాత కాసేపటికి రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ నుంచి తనకు ఫోన్ వచ్చిందని, తనను జాబ్‌లోంచి తీసేశారని వాళ్లు చెప్పారని యువకుడు తెలిపాడు. వ్యక్తిగత పరిశుభ్రత సంబంధిత సమస్య కారణంగా ఉద్యోగం నుంచి తీసేశారని తెలిసి ఆశ్చర్యపోయానని అన్నాడు.
అసలేం జరిగిందో కూడా వాళ్లు క్లియర్‌గా చెప్పకపోవడంతో తనకంతా సస్పెన్స్‌గా మారిందని అన్నాడు. తన వద్ద ఎలాంటి దుర్వాసన లేదని స్నేహితులు స్వయంగా చెప్పారని కూడా తెలిపాడు. దీంతో, అసలు ఏం జరిగిందో అర్థం కావట్లేదని వాపోయాడు.
ఈ పోస్టుపై జనాల నుంచి పెద్ద ఎత్తున స్పందించింది. యువకుడి తప్పు ఏమీ లేదని అనేక మంది కామెంట్ చేశారు. పరిశుభ్రతను సాకుగా చూపి వదిలించుకుని ఉంటారని అనేక మంది చెప్పారు. అతిగా ఆలోచించి బాధపడవద్దని సూచించారు.
ఈ వార్తలనూ చదవండి:
మహిళల డ్రెస్ వేసుకుని అర్ధరాత్రి స్కూటీ రైడ్.. చివరకు ఏం జరిగిందంటే..
ఒకటి కాదు, రెండు కాదు.. గంటలో 106 సమోసాలు.. వీడియో వైరల్