Overloaded 16 Seater Jeep: జీపులో ఏకంగా 60 మంది ప్రయాణం.. విమానం అనుకున్నారా ఏంటి?
ABN , Publish Date - Jan 11 , 2026 | 01:04 PM
ఓ జీపులో ఏకంగా 60 మంది ప్రయాణించారు. ఆ జీపు కెపాసిటీ కేవలం 16 మంది మాత్రమే. అయినా జీపులోని బోనెట్, రూఫ్, స్టెపినీ ఇలా ఎక్కడ పడితే అక్కడ ఏకంగా 60 మంది కూర్చున్నారు..
రాజస్థాన్‌లో మతి పోగొట్టే ఓ సంఘటన చోటుచేసుకుంది. 16 మంది ప్రయాణించే సామర్థ్యం ఉన్న జీపులో ఏకంగా 60 మంది ప్రయాణించారు. ఆ ప్రయాణికుల్లో ఎక్కువ మంది ఆడవారు కావటం గమనార్హం. వారంతా జీపును కప్పేసేలా అన్ని వైపులా కూర్చుని ప్రయాణం చేశారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. బన్స్‌వారా జిల్లాలోని ఆనంద్‌పురి ఏరియాలో గిరిజనులు ఎక్కువగా జీవిస్తున్నారు. ఆ ప్రాంతంలో రవాణా వ్యవస్థ చాలా దారుణంగా ఉంటుంది. ఉన్న అతి తక్కువ సంఖ్యలోని వాహనాల్లోనే అక్కడి ప్రజలు ప్రయాణం చేస్తుంటారు. వాహనాల సామర్థ్యం కంటే 10 రెట్లు ఎక్కువ మంది ప్రయాణిస్తున్నారు.
తాజాగా, ఓ జీపులో ఏకంగా 60 మంది ప్రయాణించారు. ఆ జీపు కెపాసిటీ కేవలం 16 మంది మాత్రమే. అయినా జీపులోని బానెట్, రూఫ్, స్టెపినీ ఇలా ఎక్కడ పడితే అక్కడ 60 మంది కూర్చున్నారు. ముందు ఏం జరుగుతోందో డ్రైవర్ చూడ్డం కోసం కేవలం చిన్న ప్రదేశాన్ని మాత్రమే ఖాళీగా ఉంచారు. ఇక, ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జిల్లా రవాణా శాఖ అధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో రవాణ శాఖ, ట్రాఫిక్ పోలీసులు ఆ ప్రాంతంలో రైడ్స్ నిర్వహిస్తున్నారు. కెపాసిటీని మించి జనాలను తీసుకెళ్తున్న వాహనాలపై ఫైన్లు వేస్తున్నారు.
దీనిపై జిల్లా రవాణ శాఖాధికారి పంకజ్ శర్మ మాట్లాడుతూ.. ‘సరైన విధంగా వాహన సదుపాయాలు లేకపోవటం వల్లే ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. ఏది ఏమైనా ట్రాఫిక్ రూల్స్ పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం’ అని తెలిపారు. ఇక, ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘అది ఏమైనా విమానం అనుకుంటున్నారా? అంతమంది తాపీగా కూర్చుని ప్రయాణం చేస్తున్నారు. కొంచెం అటు, ఇటు అయినా ప్రాణాలు పోతాయ్’..‘ఇలాంటివన్నీ కేవలం మన ఇండియాలో మాత్రమే జరుగుతుంటాయి’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
జీర్ణశక్తిని కాపాడే మంచి ఔషధం పనసపొట్టు...
కేంద్రం నోటీసులు.. ఆ యూజర్లకు చుక్కలు చూపిస్తున్న ఎక్స్..