పికిల్ బాల్ ఆడుతూ కిందపడ్డ స్టార్ హీరో ఆమిర్ ఖాన్..
ABN , Publish Date - Feb 08 , 2026 | 12:42 PM
బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్.. పికిల్ బాల్ ఆడుతుండగా అనుకోని సంఘటన చోటుచేసుకుంది. బ్యాట్‌తో బాల్‌ను కొట్టే సమయంలో ఆమిర్ ఖాన్ అదుపుతప్పారు. ముందుకు దూసుకెళ్లి కింద పడిపోయారు..
ముంబై, ఫిబ్రవరి 8: బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ ముంబైలో జరుగుతున్న వరల్డ్ పికిల్ బాల్ లీగ్ 2026 వేడుకల్లో శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన ఫ్యాన్స్‌తో కలిసి పికిల్ బాల్ ఆడారు. ఆట సందర్భంగా అనుకోని సంఘటన చోటుచేసుకుంది. బ్యాట్‌తో బాల్‌ను కొట్టే సమయంలో ఆమిర్ ఖాన్ అదుపుతప్పారు. ముందుకు దూసుకెళ్లి పడిపోయారు. అయితే, ఆమిర్‌కు ఎలాంటి గాయాలూ కాలేదు. కిందపడ్డ వెంటనే ఆయన పైకి లేచారు. బ్యాట్‌ను చేతిలోకి తీసుకుని నవ్వుతూ మళ్లీ ఆటను కొనసాగించారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆ వీడియోలో ఏముందంటే.. ఆమిర్ తన వైపు వచ్చిన బాల్‌ను ఎంతో చాకచక్యంగా ప్రత్యర్థి వైపు కొట్టారు. మరోసారి తన వైపు వచ్చిన బాల్‌ను కొట్టడానికి ప్రయత్నించారు. ఈ సారి చాలా ముందుకు వెళ్లి బాల్‌ను కొట్టే ప్రయత్నం చేశారు. అయితే ఈ క్రమంలో ఆయన అదుపు తప్పి ముందుకు పడిపోయారు. ముందుకు పడ్డ వెంటనే పైకి లేచారు. ఆయనతో పాటు పికిల్ బాల్ ఆడుతున్న యువతి చేయి అందించి పైకి లేవడానికి సాయం చేసింది. ఆమిర్ పైకి లేచి బ్యాట్ తీసుకుని.. నవ్వుతూ తన ఆటను మళ్లీ కొనసాగించారు.
ఇక, ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘60 ఏళ్ల వయసులోనూ ఇంత ఫిట్‌గా ఉన్నారు. మీరు చాలా గ్రేట్ సార్’.. ‘పాపం అందరి ముందు పరువు పోయింది. అక్కడున్న వాళ్లు నవ్వుతున్నారు’..‘ఆ వీడియోకు యాక్సిడెంట్ మ్యూజిక్ ఎందుకు పెట్టారు. చాలా దారుణంగా ఉంది. ముందు వీడియో డిలీట్ చేయండి’.. ‘ఆ వీడియోకు .. మ్యూజిక్‌కు సంబంధం ఏమైనా’ ఉందా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ఫుట్‌బాల్ దేశంలో క్రికెట్ క్రేజ్