కాటేసిన పాముని పట్టుకుని ఆసుపత్రికి.. వృద్ధుడి సాహసం, వీడియో వైరల్!
ABN , Publish Date - Mar 18 , 2026 | 08:40 AM
వియత్నాంలోని డా నాంగ్ నగరానికి సమీపంలో ఉన్న డై లోక్ ప్రాంతంలో ఒక 79 ఏళ్ల వృద్ధుడిని విషపూరితమైన పాము కాటేసింది. అయినా, ఆ వ్యక్తి ఏమాత్రం భయపడకుండా ఆ పామును పట్టుకొని నడుచుకుంటూ వెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: వియత్నాంలోని డా నాంగ్ నగరానికి సమీపంలో ఉన్న డై లోక్ అనే ప్రాంతంలో ఒక 79 ఏళ్ల వృద్ధుడిని విషపూరితమైన నాగుపాము కరిచింది. అంగవైకల్యంతో ఉన్న ఆ వృద్ధుడు ప్రాణాపాయ స్థితిలో కూడా ఏమాత్రం బెదరకుండా ఆ భారీ నాగు పామును పట్టుకుని నడుచుకుంటూ వెళ్లడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
డై లోక్ కమ్యూన్‌కు చెందిన ఓ వృద్ధుడిని పాము కాటు వేసింది. వెంటనే అప్రమత్తమైన అతను.. ఏమాత్రం భయపడకుండా సంయమనం పాటించి, ముందుగా ఆ పామును పట్టుకొని తన ఇంటికి వెళ్లాడు. చికిత్స కోసం అతని కుటుంబ సభ్యులు అతన్ని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. బాధితుడిని మొదట క్వాంగ్ నామ్ ఉత్తర పర్వత ప్రాంతంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఆ తర్వాత అతడిని డా నాంగ్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. అదృష్టవశాత్తు, ఆ వ్యక్తి పరిస్థితి నిలకడగా ఉందని, త్వరలోనే కోలుకుంటాడని వైద్యులు తెలిపారు. పాము కాటుకు గురైనప్పటికీ ఏమాత్రం భయపడకుండా దాన్ని పట్టుకొని నడుచుకుంటూ వెళ్లిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు రక రకాలుగా స్పందిస్తున్నారు.