Breaking News: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభ
ABN , First Publish Date - Jan 15 , 2026 | 07:40 AM
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
Live News & Update
-
Jan 15, 2026 08:43 IST
విజయవాడ: ఉమ్మడి కృష్ణా జిల్లాలో జోరుగా కోడిపందాలు
తొలిరోజు చేతులు మారిన కోట్ల రూపాయలు
రెండోరోజు బరుల దగ్గర బారులు తీరిన వాహనాలు
సందర్శకులతో కిక్కిరిసిపోయిన ప్రత్యేక గ్యాలరీలు
కేసరపల్లి, రామవరపాడు, మీర్జాపురం జోరుగా పందాలు
-
Jan 15, 2026 08:43 IST
తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవలు పునరుద్ధరణ
తిరుమల: ధనుర్మాస ఘడియలు ముగింపుతో సుప్రభాత సేవలు
వేకువజామున స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొల్పిన అర్చకులు
స్వామివారి సుప్రభాత సేవకు భక్తులను అనుమతించిన టీటీడీ
నేటి అర్ధరాత్రి నుంచి భోగశ్రీనివాసమూర్తికి ఏకాంతసేవ నిర్వహణ
-
Jan 15, 2026 08:42 IST
జోరుగా కోడిపందాలు
రాజమండ్రి: తూ.గో., కోనసీమ, పోలవరం జిల్లాల్లో కోడిపందాలు
జోరుగా కోడిపందాలు, గుండాటలు, పేకాటలు
కోట్ల రూపాయల వరకు బెట్టింగ్‌లు నిర్వహణ
ఎమ్మెల్యేలు, పోలీసుల కనుసన్నల్లోనే కోడిపందాల బరులు
కొన్ని బరులకు వేలం నిర్వహించిన ఎమ్మెల్యేలు
రాత్రిపూట నిర్విరామంగా కొనసాగుతున్న కోడిపందాలు
-
Jan 15, 2026 08:42 IST
అమరావతి: ఉదయానికే ఉద్యోగుల ఖాతాల్లో సొమ్ములు
ఆరేళ్ల తర్వాత 60 నెలల బకాయిలు జమ
లక్షల మంది ఉద్యోగుల ఇళ్లలో సంక్రాంతి సంబరాలు
పోలీసులకూ సరెండర్ లీవు మొత్తాలు జమ
-
Jan 15, 2026 07:42 IST
తప్పిన ట్యాంకర్ల గూడ్స్ రైలు
నెల్లూరు: కావలి ముసునూరులో పట్టాలు తప్పిన ట్యాంకర్ల గూడ్స్ రైలు
పూర్తిగా పట్టాలు తప్పిన 3 ట్యాంకర్లు, మరమ్మతులు చేపట్టిన సిబ్బంది
వైజాగ్ నుంచి రేణిగుంటకు వెళ్తుండగా ప్రమాదం
-
Jan 15, 2026 07:42 IST
అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం
75 దేశాల పౌరులకు వీసా జారీ నిలిపివేత
పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్, రష్యా, బ్రెజిల్, ఆఫ్ఘనిస్థాన్..
ఇరాన్ సహా పలు దేశస్థులకు US వీసా జారీ నిలిపివేత
వలసదారుల విషయంలో అమెరికా మరింత కఠిన వైఖరి
-
Jan 15, 2026 07:42 IST
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల కోసం రిజర్వేషన్లు ఖరారు
121 మున్సిపాలిటీల్లో చైర్‌పర్సన్ల సంఖ్య ఖరారు
మున్సిపాలిటీల్లో జనరల్ 30, జనరల్ మహిళ 31 స్థానాలు
ఎస్టీ జనరల్ 3, ఎస్టీ మహిళ 2, ఎస్సీ జనరల్ 9, ఎస్సీ మహిళ 8,..
బీసీ జనరల్ 19, బీసీ మహిళ 19 స్థానాలు ఖరారు
10 కార్పొరేషన్లలో జనరల్ 1, జనరల్ మహిళ 4, బీసీ జనరల్ 2,..
బీసీ మహిళ 1, ఎస్సీ 1, ఎస్టీ 1 స్థానం ఖరారు
-
Jan 15, 2026 07:40 IST
సంక్రాంతి శుభాకాంక్షలు
తెలుగు ప్రజలకు సీఎం చంద్రబాబు సంక్రాంతి శుభాకాంక్షలు
పండుగ వేళ ప్రజలు ఆనందంగా ఉండాలని చంద్రబాబు ఆకాంక్ష
-
Jan 15, 2026 07:40 IST
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభ
తెలుగు లోగిళ్ల ముంగిట రంగురంగుల రంగవల్లులు
పల్లెల్లో డూడూ బసవన్నల విన్యాసాలు
హరిదాసుల కీర్తనలతో కళకళలాడుతున్న పల్లెలు
-
Jan 15, 2026 07:40 IST
ABN ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు