నెక్లెస్ రోడ్డులో ‘యువ భారత్ రన్ 2026’
ABN, Publish Date - Mar 29 , 2026 | 04:00 PM
దేశ భవిష్యత్తు యవత ఆరోగ్యకరమైన అలవాట్లపై ఆధారపడి ఉందని తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా తెలిపారు. ఆదివారం యువ భారత్ రన్ 2026 కార్యక్రమంలో భాగంగా నెక్లెస్ రోడ్డులో 10కె, 5కె రన్‌లను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఇది పరుగుగానే కాకుండా.. ఇదొక శక్తివంతమైన ప్రజా ఉద్యమం అని అభివర్ణించారు.
1/8
దేశ భవిష్యత్తు యవత ఆరోగ్యకరమైన అలవాట్లపై ఆధారపడి ఉందని తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా తెలిపారు.
2/8
ఆదివారం యువ భారత్ రన్ 2026 కార్యక్రమంలో భాగంగా నెక్లెస్ రోడ్డులో 10కె, 5కె రన్‌లను ఆయన జెండా ఊపి ప్రారంభించారు.
3/8
ఇది పరుగుగానే కాకుండా.. ఇదొక శక్తివంతమైన ప్రజా ఉద్యమం అని అభివర్ణించారు.
4/8
ప్రధాని మోదీ పిలుపు మేరకు ప్రతి కుటుంబం క్రియాశీల జీవనశైలిని అలవర్చుకోవాలన్నారు.
5/8
డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టి.. ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
6/8
తల్లిదండ్రులతో సమయం గడపడం, ఉదయం త్వరగా నిద్ర లేవడం, వ్యాయాయం చేయడంతోపాటు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వంటి మంచి లక్షణాలు అలవరుచుకోవాలని యువతకు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు.
7/8
యువ భారత్ రన్ 2026 కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి, రాష్ట్ర ఐటీ మంత్రి డి.శ్రీధర్ బాబు, టీ బీజేపీ చీఫ్ రాంచందర్ రావుతోపాటు హీరో శర్వానంద్ పాల్గొన్నారు.
8/8
ఈ రన్‌లో 10 వేలకు మందికి పైగా పాల్గొన్నారు.
Updated at - Mar 29 , 2026 | 04:02 PM