స్వర్ణభారత్ ట్రస్ట్‌లో ఘనంగా సంక్రాంతి సంబరాలు

ABN, Publish Date - Jan 11 , 2026 | 05:56 PM

తన పిల్లలకు వారసత్వంగా స్వర్ణభారత్ ట్రస్ట్ మాత్రమే ఇస్తున్నానని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. ఆదివారం శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్ స్వర్ణభారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో పలువురు ప్రముఖులతోపాటు వెంకయ్యనాయుడు కుటుంబం పాల్గొంది.

స్వర్ణభారత్ ట్రస్ట్‌లో ఘనంగా సంక్రాంతి సంబరాలు 1/10

తన పిల్లలకు వారసత్వంగా స్వర్ణభారత్ ట్రస్ట్ మాత్రమే ఇస్తున్నానని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు.

స్వర్ణభారత్ ట్రస్ట్‌లో ఘనంగా సంక్రాంతి సంబరాలు 2/10

ఆదివారం శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్ స్వర్ణభారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో పలువురు ప్రముఖులతోపాటు వెంకయ్యనాయుడు కుటుంబం పాల్గొన్నారు.

స్వర్ణభారత్ ట్రస్ట్‌లో ఘనంగా సంక్రాంతి సంబరాలు 3/10

ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. రాజకీయాల్లో వారసత్వాన్ని ప్రోత్సహించడం తనకు ఇష్టం లేదన్నారు. అందువల్లే రాజకీయాల్లోకి తన కుమారుడు, కుమార్తెను రానివ్వలేదని చెప్పారు. సంస్కృతి, సంప్రదాయాలను కాపాడాలని తన పిల్లలకు సూచించానని తెలిపారు.

స్వర్ణభారత్ ట్రస్ట్‌లో ఘనంగా సంక్రాంతి సంబరాలు 4/10

అదే తాను ఇచ్చే సంపద అని పేర్కొన్నారు. ఏది మారినా మన సంస్కృతి సంప్రదాయాలు మారకూడదని అభిప్రాయపడ్డారు.

స్వర్ణభారత్ ట్రస్ట్‌లో ఘనంగా సంక్రాంతి సంబరాలు 5/10

మూలాలు మార్చిపోకుండా ప్రతి ఏడాది స్వర్ణ భారత్ ట్రస్ట్ ఉత్సవాలు నిర్వహిస్తున్నామని వివరించారు.

స్వర్ణభారత్ ట్రస్ట్‌లో ఘనంగా సంక్రాంతి సంబరాలు 6/10

ఆరుగాలం శ్రమించి పండించిన పంట ఇంటికి చేరే సమయంలో సంక్రాంతి పండగ నిర్వహించుకుంటామని చెప్పారు.

స్వర్ణభారత్ ట్రస్ట్‌లో ఘనంగా సంక్రాంతి సంబరాలు 7/10

అయితే ఈ మధ్య వాతావరణ మార్పులు చోటు చేసుకుంటున్నాయని వెంకయ్యనాయుడు తెలిపారు. ప్రక‌ృతితోనే మన పండగలు ముడిపడి ఉన్నాయన్నారు.

స్వర్ణభారత్ ట్రస్ట్‌లో ఘనంగా సంక్రాంతి సంబరాలు 8/10

ప్రకృతి బాగుంటేనే భవిష్యత్తు సైతం బాగుంటుందని వెంకయ్యనాయుడు చెప్పారు.

స్వర్ణభారత్ ట్రస్ట్‌లో ఘనంగా సంక్రాంతి సంబరాలు 9/10

ఈ సంక్రాంతి సంబరాల్లో త్రిపుర గవర్నర్ ఎన్. ఇంద్రసేనా రెడ్డి, స్వర్ణ భారత్ ట్రస్ట్ చైర్మన్, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, ప్రముఖ నటుడు బ్రహ్మానందం, ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామంచందర్ రావు తదితరులు పాల్గొన్నారు.

స్వర్ణభారత్ ట్రస్ట్‌లో ఘనంగా సంక్రాంతి సంబరాలు 10/10

ఈ స్వర్ణభారత్ ట్రస్ట్ నిర్వహించిన పలు కోర్సుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి సర్టిఫికేట్లు ప్రదానం చేశారు.

Updated at - Jan 11 , 2026 | 05:59 PM