మార్కెట్‌లో ఉగాది పండుగ సందడి..
ABN, Publish Date - Mar 18 , 2026 | 06:53 PM
తెలుగు నూతన సంవత్సరం ఉగాది సందర్భంగా మార్కెట్లు సందడిగా మారాయి. పూలు, మామిడికాయలు, మామిడి ఆకుల కొనుగోళ్లతో పండుగ సంబరాలు మొదలయ్యాయి.
1/6
ఉగాది పండుగ నేపథ్యంలో హైదరాబాద్ లోని మార్కెట్లు సందడిగా మారాయి. కొత్తపేట రైతు బజార్ వద్ద ప్రజలు పండుగకు అవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తున్నారు.
2/6
పూలు, మామిడికాయలు, మామిడి ఆకుల కొనుగోళ్లతో పండుగ సంబరాలు మొదలయ్యాయి.
3/6
మామిడికాయలు, మామిడి ఆకులకు ప్రత్యేక డిమాండ్ ఉండటంతో వాటి ధరలు కూడా స్వల్పంగా పెరిగినట్లు తెలుస్తోంది.
4/6
తోరణాలు, చింతపండు, బెల్లం వంటి వాటిని కూడా ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు.
5/6
షడ్రుచుల ఉగాది పచ్చడి కోసం ప్రజలు ఉత్సాహంగా మామిడికాయలు, వేప పూత వంటి సరుకులు కొంటున్నారు.
6/6
పండుగ వాతావరణం కారణంగా మార్కెట్ మొత్తం సందడిగా కనిపిస్తోంది. కుండలకు కూడా బాగా డిమాండ్ పెరిగినట్లు తెలుస్తోంది.
Updated at - Mar 18 , 2026 | 06:54 PM