రెండో రోజుకు ఆర్టీసీ సమ్మె.. డిపోలకే పరిమితమైన బస్సులు
ABN, Publish Date - Apr 23 , 2026 | 10:36 AM
తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె రెండో రోజు కొనసాగుతోంది. తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించే వరకూ సమ్మె కొనసాగుతుందని ఆర్టీసీ జేఏసీ స్పష్టం చేసింది. సమ్మె కారణంగా హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. తెల్లవారుజాము నుంచి డిపోల ఎదుట ఆర్టీసీ కార్మికులు నిరసనకు దిగారు. బస్సులు లేకపోవడంతో బస్టాండ్‌ల వద్ద ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
1/7
భూపాలపల్లి జిల్లాలో రెండో రోజుకు ఆర్టీసీ కార్మికుల సమ్మె. ఎక్కడికక్కడ నిలిచిన బస్సులు.
2/7
భూపాలపల్లి ఆర్టీసీ డిపో ముందు కార్మికుల నిరసన.
3/7
వనపర్తి జిల్లా కేంద్రంలో ఆర్టీసీ డిపో వద్ద రెండో రోజు కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె.
4/7
వనపర్తి డిపోలో నిలిచిన బస్సులు. ఆర్టీసీ బస్టాండ్లో బస్సు ఎక్కుతున్న ప్రయాణికులు.
5/7
బస్సుల కోసం ప్రయాణికుల ఎదురుచూపులు.
6/7
హనుమకొండ బస్టాండ్లో ఆర్టీసీ కార్మికుల ధర్నా.
7/7
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ యూనియన్ నాయకులు బస్ డిపో ముందు ధర్నా చేస్తున్న దృశ్యాలు.
Updated at - Apr 23 , 2026 | 11:42 AM