కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల ఆందోళన.. డిపోలకే పరిమితమైన బస్సులు

ABN, Publish Date - Apr 22 , 2026 | 10:11 AM

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె సైరన్ మోగింది. కార్మిక సంఘాల పునరుద్ధరణ సహా మెుత్తం 32 హామీలు నెరవేర్చాలని ఆర్టీసీ జేఏసీ సమ్మెకు దిగింది. సమ్మె ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా బస్సులను డిపోలకే పరిమితం చేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పలు డిపోల ఎదుట బైఠాయించి డిమాండ్లు నెరవేర్చాలని నినాదాలు చేస్తున్నారు. మరోవైపు ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారిస్తున్నారు.

కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల ఆందోళన.. డిపోలకే పరిమితమైన బస్సులు 1/13

తమ డిమాండ్లను నిరవేర్చాలని ఖమ్మం బస్ డిపో వద్ద ఆర్టీసీ కార్మికుల నిరసన. వారికి మద్దతుగా ఆర్టీసీ జేఏసీ నేతలు

కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల ఆందోళన.. డిపోలకే పరిమితమైన బస్సులు 2/13

నల్లగొండ జిల్లా బస్ స్టాప్ వద్ద బస్సుల కోసం ఎదురు చూస్తున్న ప్రయాణికులు.

కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల ఆందోళన.. డిపోలకే పరిమితమైన బస్సులు 3/13

నల్లగొండ బస్ డిపో వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న ఆర్టీసీ కార్మికులు

కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల ఆందోళన.. డిపోలకే పరిమితమైన బస్సులు 4/13

సిద్దిపేట బస్ డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు నిరసన తెలుపుతున్న దృశ్యం

కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల ఆందోళన.. డిపోలకే పరిమితమైన బస్సులు 5/13

వనపర్తి బస్ డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు నిరసన తెలుపుతున్న దృశ్యం

కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల ఆందోళన.. డిపోలకే పరిమితమైన బస్సులు 6/13

వనపర్తి బస్ డిపోలో బస్సుల కోసం ఎదురు చూస్తున్న ప్రయాణికులు, ఆటోల్లో వెళ్తున్న మహిళలు

కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల ఆందోళన.. డిపోలకే పరిమితమైన బస్సులు 7/13

సిద్దిపేటలో ఆర్టీసీ సమ్మె కారణంగా బస్సులు నడవక పోవడంతో కార్లు, ఆటోల్లో వెళ్తున్న ప్రయాణికులు

కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల ఆందోళన.. డిపోలకే పరిమితమైన బస్సులు 8/13

మహబూబ్‌నగర్ బస్టాండ్ బస్సుల కోసం ఎదురు చూస్తున్న ప్రయాణికులు, డిపోలకే పరిమితమైన బస్సులు

కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల ఆందోళన.. డిపోలకే పరిమితమైన బస్సులు 9/13

మహబూబ్‌నగర్ బస్టాండ్ నుంచి బస్సు బయలుదేరుతుంటే ఆర్టీసీ కార్మికులు అడ్డుకుంటున్న దృశ్యాలు

కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల ఆందోళన.. డిపోలకే పరిమితమైన బస్సులు 10/13

సమ్మె సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిద్దిపేట బస్ స్టాండ్ వద్ద పోలీసులు బందోబస్తు.

కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల ఆందోళన.. డిపోలకే పరిమితమైన బస్సులు 11/13

భూపాల్ పల్లి జిల్లాలో ఆర్టీసీ సమ్మె కారణంగా డిపోలకే పరిమితమైన బస్సులు, ఖాళీగా ఉన్న బస్టాండ్

కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల ఆందోళన.. డిపోలకే పరిమితమైన బస్సులు 12/13

భూపాల్‌పల్లి జిల్లాలో ఆర్టీసీ సమ్మె.. గెట్ ముందు నుంచి బస్సు రాకుండా ధర్నా చేస్తున్న ఆర్టీసీ కార్మికులు, అడ్డుకుంటున్న పోలీసులు

కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల ఆందోళన.. డిపోలకే పరిమితమైన బస్సులు 13/13

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణాల నిలిచిపోయిన బస్సులు

Updated at - Apr 22 , 2026 | 12:22 PM