మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం..

ABN, Publish Date - Feb 10 , 2026 | 09:04 PM

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు బుధవారం (11-02-2026) పోలింగ్ జరగనుంది. అందుకు సంబంధించిన ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఇప్పటికే పూర్తి చేసింది. ఎన్నికల విధులు కేటాయించడంతో.. ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు.. ప్రత్యేక వాహనాల్లో వెళ్తున్నారు.

మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం.. 1/16

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు బుధవారం (11-02-2026) పోలింగ్ జరగనుంది. అందుకు సంబంధించిన ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఇప్పటికే పూర్తి చేసింది.

మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం.. 2/16

ఎన్నికల విధులు కేటాయించడంతో.. ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు.. ప్రత్యేక వాహనాల్లో వెళ్తున్నారు.

మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం.. 3/16

ఈవీఎంలు, ఇంక్ బాటిళ్లు తదితర సామాగ్రిని వారు తమ వెంట తీసుకు వెళ్లారు.

మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం.. 4/16

ఈ ఎన్నికల వేళ.. పోలింగ్ కేంద్రాల్లో చేపట్టాల్సిన విధి విధానాలను ఇప్పటికే సిబ్బందికి ఉన్నతాధికారులు వివరించారు.

మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం.. 5/16

ఈ ఎన్నికల బరిలో మొత్తం 12,930 మంది అభ్యర్థులు నిలిచారు.

మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం.. 6/16

ఎన్నికల కోసం 8,203 పోలింగ్ కేంద్రాలు, 16,301 బ్యాలెట్ బాక్సులను ఎన్నికల సంఘం ఇప్పటికే సిద్ధం చేసింది.

మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం.. 7/16

ఈ ఎన్నికల్లో దాదాపు 52 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం.. 8/16

బుధవారం (ఫిబ్రవరి11) ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ జరగనుంది.

మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం.. 9/16

ఈ ఎన్నికలు జరిగే ప్రాంతంలో.. పోలింగ్ సమయంలో మద్యం షాపులు మూసేయాలని ఇప్పటికే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం.. 10/16

ఇక ఎన్నికలు జరగనున్న ప్రదేశాల్లో స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు సెలవు ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.

మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం.. 11/16

అలాగే భారీగా పోలీసులను మోహరించారు. తమ ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ ఓటర్లకు జిల్లా అధికారులు విజ్ఞప్తి చేశారు.

మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం.. 12/16

ఇప్పటికే పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుని అగ్రస్థానంలో నిలిచింది.

మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం.. 13/16

ఇక ఈ ఎన్నికల్లో సైతం తమ సత్తా చాటుతామని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం.. 14/16

మరో వైపు ఈ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పోటా పోటీగా ప్రచారాన్ని నిర్వహించాయి.

మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం.. 15/16

అధికార పార్టీపై ప్రతిపక్షాలు విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నాయి.

మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం.. 16/16

కానీ ఏ పార్టీకి ఓటరు పట్టం కడతాడనేది తెలియాలి అంటే మాత్రం.. ఫిబ్రవరి 13వ తేదీ వరకు ఆగాల్సిందేనన్నది సుస్పష్టం.

Updated at - Feb 10 , 2026 | 09:43 PM