‘అందెశ్రీ స్మృతివనం’ నిర్మాణానికి సీఎం రేవంత్‌రెడ్డి భూమి పూజ
ABN, Publish Date - Jul 19 , 2026 | 06:36 AM
ప్రజాకవి అందెశ్రీ 65వ జయంతి సందర్భంగా రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్‌లో రూ.4 కోట్లతో ప్రభుత్వం నిర్మిస్తున్న అందెశ్రీ విగ్రహం, స్మృతివనం పనులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం భూమి పూజ చేశారు.
1/11
ప్రజాకవి అందెశ్రీ 65వ జయంతి సందర్భంగా రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్‌లో రూ.4 కోట్లతో ప్రభుత్వం నిర్మిస్తున్న అందెశ్రీ విగ్రహం, స్మృతివనం పనులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం భూమి పూజ చేశారు.
2/11
అందెశ్రీ సమాధి వద్ద నివాళులు అర్పించారు ముఖ్యమంత్రి.
3/11
అందెశ్రీకి ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నివాళులు అర్పించారు.
4/11
అందెశ్రీ తనకు ఒక ఆత్మ బంధువని, తెలంగాణలో గత పాలకుల అహంకార వైఖరిపై అందెశ్రీ గళమెత్తారని సీఎం పేర్కొన్నారు.
5/11
నిరాశ, నిస్పృహలకు లోనైనప్పుడు అందెశ్రీ తనకు స్ఫూర్తిగా నిలబడేవారని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఆయన పాటలు తూటాలై, మరపిరంగులై గడీలను బద్దలు కొట్టాయని అభివర్ణించారు.
6/11
ముఖ్యమంత్రిగా ప్రజల ముందు నిలబడటానికి అందెశ్రీ తనకు స్ఫూర్తి అని రేవంత్‌రెడ్డి కొనియాడారు. ఇటుకపై ఇటుక పేర్చిన తాపీ మేస్త్రీ.. అక్షరాలపై అక్షరాలని పేర్చి ఉద్యమ గీతాలను ఆయన రాశారని ప్రశంసించారు.
7/11
అందెశ్రీ ప్రజల్లో చైతన్యం నింపారని, ఆయన పాట మన గుండెల్లో ఓ చైతన్యాన్ని నింపిందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. అందెశ్రీ రాసిన జయ జయహే తెలంగాణ గీతం రాష్ట్ర గీతంగా ప్రజల గుండెల్లో నిలుస్తుందని ఆనాడు భావించామని పేర్కొన్నారు.
8/11
కేసీఆర్ హయాంలోని గత పదేళ్లలో కుట్రలతో అందెశ్రీ పాటను వినిపించకుండా చేశారని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పుకొచ్చారు. పెన్నులపై మన్ను కప్పితే గనులై మొలకెత్తుతాయని అన్నట్లుగా… ఇప్పుడు తెలంగాణ ప్రతీ బడిలో, ప్రతీ గడపలో ఆయన పాట వినిపిస్తోందని తెలిపారు. ఆత్మగౌరవంతో ఆయన ఏనాడు దొరల గడప తొక్కలేదని పేర్కొన్నారు.
9/11
అందెశ్రీ పాట కోట్లాది తెలంగాణ ప్రజల కోసం తప్ప… గడీల్లో దొరల కోసం కాదని ఆయన నిటారుగా నిలబడ్డారని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. మనందరం దండు కట్టి విష సర్పాలను తుదముట్టించాలని ఆయన అన్న మాటలు తనకు ఇంకా గుర్తుకొస్తున్నాయని చెప్పారు. తన కుటుంబంలో పెద్దన్నగా అందెశ్రీని భావించానని అన్నారు.
10/11
ఏ రోజయితే గత పాలకులు అందెశ్రీ గళాన్ని బంధించాలనుకున్నారో.. గద్దరన్నను అవమానించారో ఆనాడే గడీల పాలనను శాశ్వతంగా పాతరేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. మేక తోలు కప్పుకున్న తోడేలు ఇవాళ మాట్లాడుతోందని విమర్శించారు. ఈ తోడేళ్ల గుంపును తాను ప్రశ్నిస్తున్నానని పేర్కొన్నారు.
11/11
తమకు అందెశ్రీ, గద్దర్, సోనియా గాంధీ స్ఫూర్తి అని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్ అండ్ కోకు ఎవరు స్ఫూర్తి… నిజాం, ఖాసీం రజ్వీ వారికి స్ఫూర్తి? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలోని దోపిడీని ప్రజలు ఇంకా మరిచిపోలేదని చెప్పుకొచ్చారు.
Updated at - Jul 19 , 2026 | 09:45 AM