రావిర్యాలలో సుజెన్ మెడికేర్ ఫార్మా యూనిట్ ప్రారంభించిన సీఎం రేవంత్
ABN, Publish Date - Jan 09 , 2026 | 07:43 PM
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాలలోని ఈ- సిటీలో సుజెన్ మెడికేర్ ప్రైవేట్ లిమిటెడ్ ఫార్మా యూనిట్‌ను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు.
1/6
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాలలోని ఈ- సిటీలో సుజెన్ మెడికేర్ ప్రైవేట్ లిమిటెడ్ ఫార్మా యూనిట్‌ను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రానికి పంచాయితీ కావాలా?, నీళ్లు కావాలా? అని అడిగితే తాను నీళ్లే కావాలని కోరుకుంటానని స్పష్టం చేశారు. వివాదం కావాలా?, పరిష్కారం కావాలా? అని అడిగితే పరిష్కారమే కావాలని కోరుకుంటానని చెప్పారు.
2/6
నీళ్ల వివాదం ముసుగులో రాజకీయ లబ్ధి పొందాలన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీకి లేదని స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా సమస్యల పరిష్కారం కోసం అందరూ సహకరించాలని పార్టీలను ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. మన సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుందామని ఆయన పిలుపునిచ్చారు.
3/6
కృష్ణా నదిపై ఉమ్మడి రాష్ట్రంలోని ప్రాజెక్టుల అనుమతులకు అడ్డంకులు పెట్టవద్దని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని కోరారు. అడ్డంకుల వల్ల కేంద్ర ప్రభుత్వ నిధులు రావడం లేదని.. దాంతో రాష్ట్రంపై ఆర్థిక భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
4/6
తాము వివాదం కోరుకోవడం లేదని.. పరిష్కారమే కోరుకుంటున్నామని చెప్పారు. రాజకీయ ప్రయోజనాలు కాదని.. ప్రజలు, రైతుల ప్రయోజనాల కోసమే ఆలోచిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
5/6
తెలంగాణకు పోర్టు కనెక్టివిటీ రావాలంటే పక్క రాష్ట్రం సహకారం అవసరమన్నారు. రెండు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకోకపోతే సమస్యలు పరిష్కారం కావని పేర్కొన్నారు. పక్క రాష్ట్రంతో చర్చలు కొనసాగుతాయని తెలిపారు.
6/6
ఏపీ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర అయినా.. పక్క రాష్ట్రాలతో వివాదాలు కోరుకోవడం లేదన్నారు. పొరుగు రాష్ట్రాలతో.. పరస్పర సహకారమే కోరుకుంటున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రకాశ్ గౌడ్, మల్ రెడ్డి రంగారెడ్డి, కాలె యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
Updated at - Jan 09 , 2026 | 07:44 PM