శ్రావణ శుక్రవారం.. భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు
ABN, Publish Date - Aug 21 , 2026 | 05:50 PM
శ్రావణ మాసంలోని శుక్రవారం సందర్భంగా ఖమ్మం జిల్లాలోని పలు దేవాలయాల్లో భక్తులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే ఆలయాలకు చేరుకున్న మహిళలు అమ్మవారికి కుంకుమార్చనలు, దీపారాధనలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.
1/7
శ్రావణ మాసం సందర్భంగా ఖమ్మం జిల్లాలోని పలు దేవాలయాలు భక్తులతో సందడిగా మారాయి.
2/7
అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు.
3/7
తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయాలకు చేరుకుని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
4/7
మహిళలు ప్రత్యేకంగా పూజా సామగ్రితో ఆలయాలకు చేరుకుని అమ్మవారికి కుంకుమార్చనలు, దీపారాధనలు నిర్వహించారు.
5/7
పూజల సందర్భంగా ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయాయి.
6/7
వరలక్ష్మి వ్రతం సందర్భంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని గాజులతో సుందరంగా అలంకరించారు. గాజుల అలంకరణలో అమ్మవారు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నారు.
7/7
దేవాలయంలో వరలక్ష్మి వ్రతం సందర్భంగా మహిళలు పరస్పరం పసుపు, కుంకుమలు ఇచ్చిపుచ్చుకుంటున్నారు.
Updated at - Aug 21 , 2026 | 06:45 PM