సంక్రాంతి సందడి మొదలు.. ఊరెళ్లే బాటలో నగరవాసులు

ABN, Publish Date - Jan 10 , 2026 | 02:38 PM

సంక్రాంతి పండుగ దగ్గరపడటంతో హైదరాబాద్‌లో సందడి మొదలైంది. పండుగను కుటుంబ సభ్యులతో కలిసి సొంత ఊళ్లలో జరుపుకోవాలనే ఉత్సాహంతో నగరవాసులు సొంతూళ్లకు బయల్దేరుతున్నారు.

సంక్రాంతి సందడి మొదలు.. ఊరెళ్లే బాటలో నగరవాసులు 1/6

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. పండుగ సందర్భంగా నగరవాసులు పట్నం నుంచి పల్లెబాట పట్టారు.

సంక్రాంతి సందడి మొదలు.. ఊరెళ్లే బాటలో నగరవాసులు 2/6

దీంతో బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి.

సంక్రాంతి సందడి మొదలు.. ఊరెళ్లే బాటలో నగరవాసులు 3/6

ప్రత్యేకంగా విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాల నుంచి వెళ్లే రూట్లలో భారీ రద్దీ కనిపిస్తోంది.

సంక్రాంతి సందడి మొదలు.. ఊరెళ్లే బాటలో నగరవాసులు 4/6

టీఎస్‌ఆర్టీసీ, ఏపీఎస్‌ఆర్టీసీ అదనపు బస్సులు నడుపుతున్నప్పటికీ, ప్రయాణికుల రద్దీ తగ్గడం లేదు. రైల్వే శాఖ కూడా సంక్రాంతి స్పెషల్ ట్రైన్లను నడుపుతోంది.

సంక్రాంతి సందడి మొదలు.. ఊరెళ్లే బాటలో నగరవాసులు 5/6

బస్ స్టాండ్లలో టికెట్లు దొరకక ప్రయాణికులు గంటల తరబడి ఎదురుచూస్తున్నారు. కుటుంబాలతో, లగేజీలతో ప్రయాణించే వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో ప్లాట్‌ఫాంలపై కూడా సందడి నెలకొంది.

సంక్రాంతి సందడి మొదలు.. ఊరెళ్లే బాటలో నగరవాసులు 6/6

రవాణా శాఖ అధికారులు రద్దీ దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు.

Updated at - Jan 10 , 2026 | 02:43 PM