నాగర్ కర్నూల్ జిల్లాలో పర్యటించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
ABN, Publish Date - Nov 26 , 2026 | 09:52 PM
ఈరోజు నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని మద్దిమడుగులలో తెలంగాణ సీఎం రేవంత్ పర్యటించారు.
1/10
ఈరోజు నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని మద్దిమడుగులలో తెలంగాణ సీఎం రేవంత్ పర్యటించారు.
2/10
అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. ఆ తరువాత అధికారులతో మాట్లాడారు.
3/10
అనంతరం సేవాలాల్ విగ్రహం ఏర్పాటు చేసే స్థలాన్ని పరిశీలించారు. విగ్రహం కోసం రేవంత్ రెడ్డి పూజలు నిర్వహించారు.
4/10
ఆ తరువాత అక్కడి హనుమాన్ ఆలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శించారు. ఆంజనేయస్వామి ఆశీస్సులు పొందారు.
5/10
ఈ సందర్భంగా మద్దిమడుగులలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఇందులో రేవంత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
6/10
సభలో రేవంత్ మొదట ప్రజలకు అభివాదం చేశారు. ఆపై ప్రసంగాన్ని ప్రారంభించారు.
7/10
ఈ సభకు ప్రజా ప్రతినిధులు, గిరిజన నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
8/10
రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఎంపీలు మల్లు రవి, బలరాం నాయక్, ఎమ్మెల్యే వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
9/10
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోసం ప్రజా ప్రతినిధులు, లంబాడి గిరిజన నాయకులు, ప్రజలు వందలాదిగా తరలివచ్చారు.
10/10
సభ ముగిసిన తరువాత మహిళలకు రేవంత్ ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు.
Updated at - Nov 26 , 2026 | 09:59 PM