హనుమకొండలో అభిమాని నిరంజన్ ఇంటికి వెళ్లిన పవన్ కల్యాణ్..
ABN, Publish Date - Jun 17 , 2026 | 09:53 PM
అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్న హనుమకొండకు చెందిన నిరంజన్‌ను.. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈరోజు(బుధవారం) ఉదయం పరామర్శించారు.
1/15
అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్న హనుమకొండకు చెందిన నిరంజన్‌ను.. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈరోజు(బుధవారం) ఉదయం పరామర్శించారు.
2/15
హనుమకొండలోని హనుమాన్ నగర్‌కు చెందిన 17 ఏళ్ల నిరంజన్ ప్రాణాంతక జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్నారు.
3/15
రోజురోజుకూ ఆరోగ్యం క్షీణిస్తున్నప్పటికీ, పవన్ కల్యాణ్‌ను ఒక్కసారి కలవాలన్న కోరికను వ్యక్తం చేశారు నిరంజన్.
4/15
ఈ విషయం తెలుసుకున్న పవన్ కల్యాణ్ స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు.
5/15
నిరంజన్ ఆరోగ్యం గురించి తెలుసుకుని పవన్ కల్యాణ్ ధైర్యం చెప్పారు. తనకు అండగా ఉంటానని భరోసా కల్పించారు.
6/15
నిరంజన్ ఇంటికి వెళ్లిన పవన్ కల్యాణ్ దాదాపు 40 నిమిషాల పాటు అతనితో ముచ్చటించారు.
7/15
ఆరోగ్య పరిస్థితి, చికిత్స వివరాలు, వ్యక్తిగత విషయాల గురించి అడిగి తెలుసుకున్నారు.
8/15
ఈ సమయంలో నిరంజన్ తన అభిమాన నటుడు, నాయకుడితో అనేక విషయాలు పంచుకున్నారు.
9/15
అరుదైన వ్యాధితో పోరాడుతున్న నిరంజన్ అసాధారణ ధైర్యం, ఆత్మవిశ్వాసం తనను ఎంతో ప్రభావితం చేశాయని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
10/15
తీవ్రమైన ఆరోగ్య సమస్యల మధ్య అతను చూపిస్తున్న మనోధైర్యం స్ఫూర్తిదాయకమని తెలిపారు.
11/15
నిరంజన్ త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి సాధారణ జీవితాన్ని గడపాలని ప్రార్థిస్తున్నట్లు పవన్ కల్యాణ్ తెలిపారు.
12/15
అలాగే తిరుమల వేంకటేశ్వరస్వామి, వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆశీస్సులు ఆయనపై ఉండాలని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు.
13/15
పవన్ కల్యాణ్‌ను చూడటానికి అభిమానులు భారీగా తరలివచ్చారు. దీంతో వరంగల్, హనుమకొండ సందడిగా మారాయి.
14/15
తన వరంగల్, హనుమకొండ పర్యటనకు సహకరించిన సీఎం రేవంత్‌రెడ్డి, తెలంగాణ ప్రభుత్వం, పోలీసు శాఖ అధికారులకు పవన్ కల్యాణ్ ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు.
15/15
పవన్ కల్యాణ్‌ను చూడటానికి అభిమానులు భారీగా తరలివచ్చారు. దీంతో వరంగల్, హనుమకొండ సందడిగా మారాయి.
Updated at - Jun 17 , 2026 | 09:59 PM