గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా దంపతులకు స్వాగతం పలికిన సీఎం రేవంత్
ABN, Publish Date - Mar 10 , 2026 | 10:07 PM
తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్‌గా నియమితులైన శివ ప్రతాప్ శుక్లా మంగళవారం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు ఘన స్వాగతం పలికారు.
1/6
తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్‌గా నియమితులైన శివ ప్రతాప్ శుక్లా మంగళవారం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు ఘన స్వాగతం పలికారు.
2/6
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబుతోపాటు పలువురు ఉన్నతాధికారులను ఆయనకు సీఎం పరిచయం చేశారు.
3/6
దేశంలోని పలు రాష్ట్రాల గవర్నర్‌లను కేంద్రం ఇటీవల బదిలీ చేసింది. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను మహారాష్ట్ర గవర్నర్‌గా బదిలీ అయ్యారు.
4/6
జిష్ణుదేవ్ వర్మ స్థానంలో తెలంగాణ గవర్నర్‌గా శివ ప్రతాప్ శుక్లా నియమితులయ్యారు.
5/6
ఇటీవల వరకు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా శివ ప్రతాప్ శుక్లా ఉన్నారు. తాజాగా ఆయనను తెలంగాణ గవర్నర్‌గా కేంద్రం నియమించింది.
6/6
దీంతో శివ ప్రతాప్ శుక్లా దంపతులు మంగళవారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఒకటి రెండు రోజుల్లో ఆయన తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.
Updated at - Mar 10 , 2026 | 10:10 PM