కరీంనగర్, నిజామాబాద్‌ జిల్లాల్లో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు మొదలు

ABN, Publish Date - Feb 13 , 2026 | 10:00 AM

కరీంనగర్ జిల్లా ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజ్‌లో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. కరీంనగర్‌ 66 డివిజన్లలో 2,14,486 ఓట్లు పోల్ అయ్యాయి. ఒక్కో డివిజన్‌కు ఒక్కో టేబుల్ చొప్పున 66 టేబుళ్ళను ఏర్పాటు చేశారు. అటు నిజామాబాద్‌లోనూ కార్పొరేషన్ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. 60 డివిజన్లకు 60 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఒక్కో రౌండ్‌కు వెయ్యి ఓట్లు లెక్కించనున్నారు. మూడు రౌండ్లలో ఫలితాలు పూర్తి అవనున్నాయి.

Updated at - Feb 13 , 2026 | 10:03 AM