కొత్త పార్టీ పేరు ప్రకటించిన కవిత
ABN, Publish Date - Apr 25 , 2026 | 11:06 AM
కల్వకుంట్ల కవిత తన కొత్త పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సేన(టీఆర్ఎస్)గా ప్రకటించారు. శనివారం మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మునీరాబాద్‌లోని అద్వయ కన్వెన్షన్ సెంటర్ వేదికగా భారీ సభను ఏర్పాటు చేశారు.
1/6
కల్వకుంట్ల కవిత తన కొత్త పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సేన(టీఆర్ఎస్)గా ప్రకటించారు. శనివారం మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మునీరాబాద్‌లోని అద్వయ కన్వెన్షన్ సెంటర్ వేదికగా భారీ సభను ఏర్పాటు చేశారు.
2/6
ఈ సభలో పార్టీ పేరు ప్రకటించిన కవిత జెండాను ఆవిష్కరించారు. అనంతరం వివిధ అంశాలతో రూపొందించిన పార్టీ ఎజెండాపై ఆమె ప్రసంగించారు.
3/6
తెలంగాణలో కొత్త విప్లవం రాబోతుందని కవిత చెప్పారు. కష్టపడి సాధించుకున్న తెలంగాణలో నూతన రాజకీయ శక్తిగా రాబోతున్నామన్నారు.
4/6
తెలంగాణ ఆత్మను బీఆర్ఎస్ పార్టీ కోల్పోయిందన్నారు. ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌తోపాటు ఆయన పార్టీపై కవిత పలు ఘాటైన విమర్శలు చేశారు.
5/6
తెలంగాణలో సామాజిక న్యాయం కోసమే టీఆర్ఎస్ పార్టీ స్థాపన అంటూ కవిత స్పష్టం చేశారు. ఈ సభకు ఆచార్య జయశంకర్ ప్రాంగణంగా నామకరణం చేశారు.
6/6
ఈ సభకు తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి భారీగా ప్రజలు తరలి వచ్చారు. ఈ సభకు వచ్చే వారి కోసం 34 రకాల తెలంగాణ వంటకాలతో విందు భోజనం ఏర్పాటు చేశారు.
Updated at - Apr 25 , 2026 | 11:26 AM