ఎగ్జామ్స్ ఫినిష్.. కాలేజీ వద్ద విద్యార్థుల సెల్ఫీలు.. కోలాహలం
ABN, Publish Date - Mar 13 , 2026 | 06:04 PM
హైదరాబాద్.. సరూర్ నగర్ జూనియర్ కాలేజ్ వద్ద ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం పరీక్షలు ముగించుకొని విద్యార్థులు ఎంతో సంతోషంగా తమ స్వస్థలాలకు వెళ్తున్నారు. కొన్ని వారాలుగా ఉన్న పరీక్షల భయం, అర్ధరాత్రి వరకు చదివిన కష్టం ఒక్కసారిగా తీరిపోయినట్లు విద్యార్థుల ముఖాల్లో చిరునవ్వు కనిపిస్తోంది. రెండేళ్ల పాటు కలిసి చదువుకున్న స్నేహితులను విడిచి వెళ్లాలన్న బాధ మరోవైపు.. తమ మధుర క్షణాలు గుర్తుంచుకోవడానికి తమ ఫ్రెండ్స్‌తో సెల్పీలు తీసుకుంటూ ఎంజాయ్ చేశారు.
1/5
పరీక్షా హాలు నుండి బయటకు రాగానే కేకలు వేస్తూ, చేతులు ఊపుతూ విద్యార్థుల ఆనందోత్సాహం.
2/5
కాలేజీ గేటు వద్ద తమ పిల్లల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్న తల్లిదండ్రులు. పరీక్ష ఎలా రాశావని అడిగే ఆరాటం. ఇంటికి వెళ్తున్నామన్న ఆనందంలో విద్యార్థులు.
3/5
కాలేజీ మెట్ల మీద, గేటు వద్ద స్నేహితులతో కలిసి సెల్ఫీలు తీసుకుంటూ ఆనందంతో వీడ్కోలు చెప్పుకుంటున్న విద్యార్థినిలు
4/5
ఎవరు ఏ కాలేజీలో చేరాలనుకుంటున్నారు, భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నారనే విషయాలపై విద్యార్థుల మధ్య చర్చించుకుంటున్న విద్యార్థినులు.
5/5
ఇంటర్ ముగిసిన వెంటనే ఎంసెట్ (EAMCET), నీట్ (NEET), లేదా ఇతర ప్రవేశ పరీక్షల కోసం ఎలా సిద్ధం కావాలని చర్చించుకుంటున్న విద్యార్థినులు.
Updated at - Mar 13 , 2026 | 06:05 PM