హైదరాబాద్‌లో అంబరాన్నంటిన హోలీ సంబరాలు

ABN, Publish Date - Mar 04 , 2026 | 01:28 PM

హైదరాబాద్‌లో హోలీ సంబరాలు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. ముఖ్యంగా యువత కోసం నగరంలో పలు ప్రాంతాల్లో భారీ ఈవెంట్‌లు, రంగుల పండుగలు ఏర్పాటు చేశారు. ఈవెంట్స్ ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు కొనసాగనున్నాయి. ఈ ఏడాది అరీనా, మాదాపూర్‌లో100 అడుగుల ఎత్తు ఉన్న భారీ 'టుమారోల్యాండ్' మెగా మ్యాసివ్ స్టేజ్ ఏర్పాటు చేశారు. హోలీ సంబరాలు జరుపుకునేందుకు వేల సంఖ్యలో చిన్నా, పెద్దా తరలి వచ్చారు.

హైదరాబాద్‌లో అంబరాన్నంటిన హోలీ సంబరాలు 1/6

మాదాపూర్‌లో 100 అడుగుల ఎత్తు ఏర్పాటు చేసిన భారీ 'టుమారోల్యాండ్' మెగా మ్యాసివ్ స్టేజ్ వద్ద ఆటపాటల మధ్య యువతులు ఎంతో ఉత్సాహంతో హోలీ సంబరాలు జరుపుకున్నారు.

హైదరాబాద్‌లో అంబరాన్నంటిన హోలీ సంబరాలు 2/6

హోలీ సంబరాలు జరుపుకునేందుకు భారీగా తరలివచ్చిన జనం. హ్యపీ హోలీ అంటూ శుభాకాంక్షలు చెప్పుకుంటూ రంగులు చల్లుకున్నారు.

హైదరాబాద్‌లో అంబరాన్నంటిన హోలీ సంబరాలు 3/6

పిల్లలు, పెద్దలు ఎంతో ఆనందోత్సాహాలతో రంగుల పండుగ జరుపుకున్నారు.

హైదరాబాద్‌లో అంబరాన్నంటిన హోలీ సంబరాలు 4/6

స్టేజ్‌పై చిన్న పిల్లలు, పెద్దవాళ్లు హ్యాపీ హోలీ అంటూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది సహజ రంగులతో (ఆర్గానిక్ కలర్స్) హోలీ జరుపుకున్నారు.

హైదరాబాద్‌లో అంబరాన్నంటిన హోలీ సంబరాలు 5/6

రంగులు చల్లుకుంటూ ఈవెంట్‌కు వచ్చిన అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్న యువతులు.

హైదరాబాద్‌లో అంబరాన్నంటిన హోలీ సంబరాలు 6/6

హోలీ వేడుకలో కొంతమంది యువతులు హ్యాపీ హోలీ అంటూ నానా హంగామా చేస్తూ అందరికీ శుభాకాంక్షలు చెప్పారు.

Updated at - Mar 04 , 2026 | 02:28 PM