మండుతున్న ఎండలు.. ప్రజల అవస్థలు

ABN, Publish Date - May 20 , 2026 | 10:18 AM

రోహిణి కార్తె ఇంకా ప్రారంభం కాలేదు. ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 10 గంటలు అయితే బయటకు వచ్చే పరిస్థితే లేదు. అత్యవసరం అయితేనే తప్పా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు.

మండుతున్న ఎండలు.. ప్రజల అవస్థలు 1/12

రోహిణి కార్తె ఇంకా ప్రారంభం కాలేదు. ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 10 గంటలు అయితే బయటకు వచ్చే పరిస్థితే లేదు.

మండుతున్న ఎండలు.. ప్రజల అవస్థలు 2/12

అత్యవసరం అయితేనే తప్పా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు.

మండుతున్న ఎండలు.. ప్రజల అవస్థలు 3/12

దీంతో ఉదయం 10 నుంచి సాయంత్రం 5.00 గంటల మధ్య హైదరాబాద్ మహానగరంలో జన సంచారం దాదాపుగా తగ్గిపోయింది.

మండుతున్న ఎండలు.. ప్రజల అవస్థలు 4/12

రహదారులు దాదాపుగా నిర్మానుష్యంగా మారిపోయాయి.

మండుతున్న ఎండలు.. ప్రజల అవస్థలు 5/12

మరి అత్యవసరం అయితే.. ఇళ్ల నుంచి ప్రజలు బయటకు వస్తున్నారు.

మండుతున్న ఎండలు.. ప్రజల అవస్థలు 6/12

ఆ సమయంలో వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.

మండుతున్న ఎండలు.. ప్రజల అవస్థలు 7/12

ముఖానికి వస్త్రాలు కప్పుకుని.. బయటకు వెళ్తున్నారు.

మండుతున్న ఎండలు.. ప్రజల అవస్థలు 8/12

అలాగే నగరంలోని వివిధ ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేసి.. ప్రజలకు తాగు నీరు అందిస్తున్నారు.

మండుతున్న ఎండలు.. ప్రజల అవస్థలు 9/12

ముఖ్యంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, జేబీఎస్, ఎంజీబీఎస్‌తోపాటు నగరంలోని పలు రైల్వే స్టేషన్లతోపాటు వివిధ ప్రాంతాల్లోని ప్రజలు రద్దీ అత్యధికంగా ఉండే ప్రదేశాల్లో కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేసి.. మంచి నీరు అందిస్తున్నారు.

మండుతున్న ఎండలు.. ప్రజల అవస్థలు 10/12

మే 25వ తేదీ నుంచి రోహిణి కార్తె ప్రారంభం కానుంది.

మండుతున్న ఎండలు.. ప్రజల అవస్థలు 11/12

ఈ రోహిణి కార్తెలో ఎండ తీవ్రత మరింత పెరుగుతుందనే ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతుంది.

మండుతున్న ఎండలు.. ప్రజల అవస్థలు 12/12

ఈ ఎండల ధాటికి పచ్చని చెట్లు ఎండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ ప్రత్యేక చర్యలు చేపట్టింది.

Updated at - May 20 , 2026 | 10:42 AM