మియాపూర్‌లో CMC కార్యాలయ భవనానికి శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి
ABN, Publish Date - Jun 09 , 2026 | 11:07 AM
హైదరాబాద్‌లోని మియాపూర్‌లో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) కార్యాలయ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన, రాష్ట్రంలో పట్టణాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు.
1/5
సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(CMC) పరిధిలో రూ.1,674.74కోట్ల నిధులతో వివిధ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు.
2/5
మియాపూర్‌లో రూ.161కోట్లతో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(CMC) ప్రధాన కార్యాలయ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు.
3/5
రూ.530కోట్లతో మియాపూర్ చౌరస్తాలో ఫ్లైఓవర్ నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. అలాగే రూ.308కోట్లతో శేరిలింగంపల్లి ఆర్వోబీ నిర్మాణ పనులకు కొబ్బరికాయ కొట్టారు.
4/5
రూ.229 కోట్లతో ఓఆర్ఆర్‌కు ఇరువైపులా ఉన్న సర్వీస్ రోడ్డు కోసం ప్రధాన వంతెన నిర్మాణం, ఓఆర్ఆర్ నుంచి కొత్త సర్వీస్ రోడ్డు ఏర్పాటుకు సీఎం రేవంత్ శంకుస్థాపన చేశారు.
5/5
అలాగే రూ.200కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికీ భూమిపూజ చేశారు. రూ.14.40కోట్లతో మాదాపూర్, నానక్‌రామ్‌గూడలో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ నిర్మాణానికి సీఎం రేవంత్ కొబ్బరికాయ కొట్టారు.
Updated at - Jun 09 , 2026 | 11:15 AM