ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి రజతోత్సవం

ABN, Publish Date - Jun 23 , 2026 | 07:46 AM

హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో జరిగిన బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ రజతోత్సవ (25 ఏళ్ల) వేడుకలు సోమవారం నాడు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు.

ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి రజతోత్సవం 1/23

హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో జరిగిన బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ రజతోత్సవ (25 ఏళ్ల) వేడుకలు సోమవారం నాడు అత్యంత వైభవంగా జరిగాయి.

ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి రజతోత్సవం 2/23

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు.

ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి రజతోత్సవం 3/23

ఈ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, ఆస్పత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ, కేంద్రమంత్రులు అనుప్రియ పటేల్, పెమ్మసాని చంద్రశేఖర్, తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో పాటు టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖ దర్శకులు, నిర్మాతలు పాల్గొన్నారు.

ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి రజతోత్సవం 4/23

తన అత్తగారు బసవతారకం క్యాన్సర్ బారిన పడిన బాధను కళ్లారా చూసిన తన మామయ్య, దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్.. పేదలకు కూడా ప్రపంచస్థాయి ఉచిత, తక్కువ ఖర్చుతో కూడిన వైద్యం అందాలనే సంకల్పంతో ఈ ఆస్పత్రికి అంకురార్పణ చేశారని సీఎం చంద్రబాబు గుర్తుచేసుకున్నారు.

ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి రజతోత్సవం 5/23

సినిమాల్లోనే కాకుండా సామాజిక సేవలోనూ బాలకృష్ణ ఒక ఛాంపియన్‌గా నిలిచారని సీఎం చంద్రబాబు కొనియాడారు.

ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి రజతోత్సవం 6/23

తండ్రి నాటిన మొక్కను ఈరోజు కల్పవృక్షంగా మార్చారని అభివర్ణించారు సీఎం చంద్రబాబు.

ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి రజతోత్సవం 7/23

రాబోయే 25 ఏళ్లలో ఈ సంస్థ దేశంలోనే నంబర్ వన్ లాభాపేక్ష లేని క్యాన్సర్ ఆస్పత్రిగా ఎదుగుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు.

ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి రజతోత్సవం 8/23

‘ఒకే కుటుంబంలో ఒకరు తండ్రి పేరిట, మరొకరు తల్లి పేరిట సేవలనందిస్తుండటం నందమూరి కుటుంబంలోనే చూస్తున్నాను. బాలకృష్ణ మాతృమూర్తి బసవతారకం పేరిట నడుపుతున్న ట్రస్ట్‌ హాస్పిటల్‌ను దేశంలోనే అత్యుత్తమ ఆస్పత్రులో ఒకటిగా మలిస్తే.. నా శ్రీమతి భువనేశ్వరి ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ద్వారా తగిన రీతిలో సేవలను అందిస్తున్నారు’ అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.

ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి రజతోత్సవం 9/23

వీరిద్దరూ ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నప్పటికీ వారి తల్లిదండ్రుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నిస్తుండటం అభినందనీయని సీఎం చంద్రబాబు కొనియాడారు

ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి రజతోత్సవం 10/23

ఈ ఆస్పత్రి క్యాన్సర్‌ బాధితులకు దేవాలయం వంటిదని అభివర్ణించారు సీఎం చంద్రబాబు.

ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి రజతోత్సవం 11/23

ఈ హాస్పిటల్‌ ఏర్పాటు వెనుక ఓ మహోన్నత ఆశయం ఉందని వివరించారు. తమ అత్తమ్మకు క్యాన్సర్‌ అని తెలిసిన వెంటనే తామంతా ఎంతో క్షోభించామని సీఎం చంద్రబాబు తెలిపారు.

ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి రజతోత్సవం 12/23

అప్పట్లో మన దగ్గర వైద్యసేవలు కూడా పెద్దగా అందుబాటులో ఉండేవి కావని.. ఆమె బాధను తాము ప్రత్యక్షంగా చూశామని సీఎం చంద్రబాబు వివరించారు. మెరుగైన చికిత్స కోసం అమెరికాకు తీసుకెళ్లినప్పటికీ ఆమెను కాపాడుకోలేకపోయామని ఆవేదన వెలిబుచ్చారు.

ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి రజతోత్సవం 13/23

ఆమె మరణం ఎన్టీఆర్‌ను తీవ్రంగా బాధించిందని.. ఆయన కోలుకోవడానికి చాలా సమయమే పట్టిందని.. అప్పట్లో ఎన్టీఆర్‌కు వచ్చిన ఆలోచనే ఈ హాస్పిటల్‌ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఆస్పత్రి నిర్వహణలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా బాలకృష్ణ సమర్థంగా నిర్వహిస్తున్నారని, ఆయన చేతుల్లో ఈ హాస్పిటల్‌ సురక్షితంగా ఉందని కొనియాడారు.

ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి రజతోత్సవం 14/23

తండ్రి (ఎన్టీఆర్‌) ఒక మొక్క నాటితే.. కొడుకు దానిని మహావృక్షం చేశాడంటూ బాలకృష్ణను ప్రశంసించారు. బసవతారకంలో ఇప్పుడు 250 మందికి పైగా నిష్ణాతులైన వైద్యులున్నారని.. ఈ ఆస్పత్రిలో ఏటా దాదాపు ఎనిమిది వేలకు పైగా శస్త్రచికిత్సలు చేయడంతోపాటు, 90వేల మందికి పైగా ఔట్‌పేషంట్లకు సేవలను అందిస్తున్నారని సీఎం చంద్రబాబు తెలిపారు.

ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి రజతోత్సవం 15/23

మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్లే ఈ రోజుల్లో క్యాన్సర్ (రాచపుండు) మహమ్మారి ఎక్కువవుతోందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.

ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి రజతోత్సవం 16/23

కేవలం చికిత్సకే పరిమితం కాకుండా, క్యాన్సర్ ముందస్తు నిర్ధారణ శిబిరాలను ఏర్పాటు చేస్తూ బసవతారకం ఆస్పత్రి సమాజానికి సేవలను అందిస్తోందని వెంకయ్యనాయుడు అభినందించారు.

ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి రజతోత్సవం 17/23

బాలకృష్ణ అంకితభావం, సేవాతత్పరత ప్రశంసనీయమని పేర్కొన్నారు వెంకయ్యనాయుడు.

ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి రజతోత్సవం 18/23

తాను ఇక్కడ ఒక నటుడిగానో, ఎమ్మెల్యేగానో కాకుండా.. క్యాన్సర్ బాధను అనుభవించిన ఒక తల్లి కొడుకుగా మాట్లాడుతున్నానని నందమూరి బాలకృష్ణ ఎమోషనల్ అయ్యారు.

ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి రజతోత్సవం 19/23

డబ్బు లేక ఏ ఒక్కరూ క్యాన్సర్ వైద్యానికి దూరం కాకూడదని బాలకృష్ణ వ్యాఖ్యానించారు.

ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి రజతోత్సవం 20/23

క్యాన్సర్‌తో భయం భయంగా ఆస్పత్రికి వచ్చిన రోగులు.. ఇక్కడి నుంచి చికిత్స పొంది చిరునవ్వుతో ఇంటికి తిరిగి వెళ్లడమే తమ నిజమైన విజయమని పేర్కొన్నారు బాలకృష్ణ.

ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి రజతోత్సవం 21/23

ఇప్పటివరకు లక్షలాది మందికి ఓపీ సేవలు అందించామని బాలకృష్ణ వివరించారు.

ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి రజతోత్సవం 22/23

సౌత్ ఇండియాలోనే మొట్టమొదటి బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ ఇక్కడే జరిగిందని బాలకృష్ణ ప్రస్తావించారు.

ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి రజతోత్సవం 23/23

హైదరాబాద్‌లోనే కాకుండా ఏపీ రాజధాని అమరావతిలో కూడా త్వరలోనే కొత్త బ్రాంచ్‌ను నిర్మిస్తున్నట్లు బాలకృష్ణ ఈ వేదికపై ప్రకటించారు.

Updated at - Jun 23 , 2026 | 08:01 AM