బస్తర్ జిల్లాలో దీపావళి వేడుకలు.. పాల్గొన్న ప్రధాని మోదీ
ABN, Publish Date - Nov 09 , 2026 | 08:18 AM
ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లా కరణ్‌పూర్‌లో ఉన్న కోబ్రా ఆపరేషన్స్ బేస్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం నాడు సందర్శించారు. అక్కడ భద్రతా బలగాలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. నక్సలిజంపై పోరాటంలో సైనికులు, భద్రతా సిబ్బంది చేసిన త్యాగాలను ప్రధాని కొనియాడారు.
1/11
ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లా కరణ్‌పూర్‌లో ఉన్న కోబ్రా (CoBRA) ఆపరేషన్స్ బేస్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం నాడు సందర్శించారు. అక్కడ భద్రతా బలగాలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. నక్సలిజంపై పోరాటంలో సైనికులు, భద్రతా సిబ్బంది చేసిన త్యాగాలను ప్రధాని కొనియాడారు.
2/11
నక్సలిజంపై దశాబ్దాలుగా కొనసాగిన పోరాటంలో కీలక మైలురాయి సాధించామని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.
3/11
దేశంలోని ప్రతి రాష్ట్రం నక్సలిజం ప్రభావం నుంచి విముక్తి పొందిన నేపథ్యంలో ఈ ఏడాది దీపావళి ప్రత్యేకమైనదని ప్రధాని పేర్కొన్నారు.
4/11
కోట్లాది మంది ప్రజలు నక్సలిజం భయం లేకుండా పండుగ చేసుకుంటున్నారని ప్రధాని మోదీ వెల్లడించారు.
5/11
నక్సలిజంపై పోరాటంలో సైనికులు, భద్రతా సిబ్బంది చేసిన త్యాగాలను ప్రధాని మోదీ కొనియాడారు.
6/11
ఒకప్పుడు మావోయిస్టుల కేంద్రంగా ఉన్న బస్తర్, అబుజ్‌మఢ్ ప్రాంతాల్లో ప్రస్తుతం పరిస్థితులు మారుతున్నాయని ప్రధాని మోదీ వివరించారు.
7/11
భద్రతా బలగాల ధైర్యం, అంకితభావం, త్యాగాల కారణంగా నక్సలిజం ముప్పు తగ్గి అభివృద్ధికి మార్గం సుగమమైందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
8/11
దేశవ్యాప్తంగా ప్రజలు తమ కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి నిర్వహించుకుంటున్న వేళ తాను మాత్రం దేశ రక్షణలో ఉన్న జవాన్లతో ఈ పండుగను చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు.
9/11
సరిహద్దుల్లోనే కాకుండా దేశ అంతర్గత ప్రాంతాల్లోనూ ప్రజలకు రక్షణ కల్పిస్తున్న భద్రతా సిబ్బంది తన కుటుంబ సభ్యులతో సమానమని ప్రధాని మోదీ అన్నారు.
10/11
నక్సలిజం సమస్యపై దాదాపు 40 నుంచి 50 ఏళ్లుగా కొనసాగుతున్న పోరాటంలో దేశం కీలక విజయాన్ని సాధించిందని ప్రధాని పేర్కొన్నారు.
11/11
ఈ గెలుపులో భద్రతా బలగాల పాత్ర ఎంతో కీలకమని, వారి సేవలను దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని తెలిపారు. నక్సలిజం ప్రభావం నుంచి బయటపడిన ప్రాంతాల్లో ప్రజలు భయంలేకుండా జీవిస్తూ అభివృద్ధిలో భాగస్వాములు అవుతున్నారని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.
Updated at - Nov 09 , 2026 | 08:30 AM