యాదగిరిగుట్టలో కార్తీక వైభవోత్సవాలు.. నృత్య ప్రదర్శనలకు మంత్రముగ్ధులైన భక్తులు
ABN, Publish Date - Nov 23 , 2026 | 10:19 AM
యాదగిరిగుట్టలో కొలువుదీరిన శ్రీలక్ష్మినరసింహస్వామి వారి దేవాలయంలో కార్తీక వైభవోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం ప్రత్యేక నృత్య ప్రదర్శనలు నిర్వహించారు.
1/11
యాదగిరిగుట్టలో కొలువుదీరిన శ్రీలక్ష్మినరసింహస్వామి వారి దేవాలయంలో కార్తీక వైభవోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం ప్రత్యేక నృత్య ప్రదర్శనలు నిర్వహించారు.
2/11
కళాకారులు వివిధ రకాల సంప్రదాయ శాస్త్రీయ నృత్యరీతిలో అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చారు.
3/11
ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, ప్రముఖ దేవాలయాల ఆధ్యాత్మిక విశిష్టత, చారిత్రక నేపథ్యం, క్షేత్ర వైభవాన్ని ఈ నృత్య రూపకంలో అత్యంత సృజనాత్మకంగా ఆవిష్కరించారు.
4/11
భారతీయ శాస్త్రీయ నృత్య సంప్రదాయాలను, తెలంగాణ రాష్ట్ర ఆధ్యాత్మిక వారసత్వాన్ని సమన్వయం చేస్తూ కళాకారులు ప్రదర్శించిన నృత్య రూపకాలు భక్తులను మంత్రముగ్ధులను చేశాయి.
5/11
నృత్యం ద్వారా దేవాలయాల ప్రాశస్త్యాన్ని, భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని చాటి చెప్పారు. కళాకారుల ప్రతిభను భక్తులు అభినందించారు.
6/11
కార్తీక వైభవోత్సవాల్లో భాగంగా ఇటువంటి కళా ప్రదర్శనలు నిర్వహించడం ద్వారా భక్తులలో ఆధ్యాత్మిక భావనతో పాటు భారతదేశంలోని శాస్త్రీయ కళల పట్ల ఆసక్తి, అవగాహన పెంపొందుతుందని దేవస్థానం అధికారులు తెలిపారు.
7/11
పరంపర వారి ఆధ్వర్యంలో రుద్రాక్ష ఫౌండేషన్స్, అభినేత్రి ఆర్ట్స్ అకాడమీ, కళాకృష్ణ బృందం కళాకారులచే నిర్వహించిన ప్రత్యేక నృత్య ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
8/11
యాదగిరిగుట్టలో నిర్వహిస్తున్న కార్తీక వైభవోత్సవాల్లో భాగంగా ఇప్పటికే స్వామి వారికి కోటి పుష్పార్చన నిర్వహించారు.
9/11
ఈ కార్యక్రమం కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పలు రకాల పుష్పాలతో స్వామి వారికి పుష్పార్చన నిర్వహించారు.
10/11
అత్యంత పుణ్యమాసాల్లో ఒకటైన కార్తీకంలో స్వామి వారిని దర్శించుకునేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలి వస్తు్న్నారు.
11/11
దీంతో స్వామి వారి దేవాలయం నిత్యం భక్తులతో నిండిపోతుంది. స్వామి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా దేవస్థానం అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
Updated at - Nov 23 , 2026 | 11:11 AM