యాదాద్రిలో స్వాతి నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజలు.. గిరి ప్రదక్షిణ

ABN, Publish Date - Oct 12 , 2026 | 09:39 AM

ప్రముఖ పుణ్యక్షేత్రం యాద్రాద్రి దేవాలయంలో శ్రీలక్ష్మీ నరసింహ స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని ఈరోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణల నడుమ స్వామివారికి వైభవంగా అష్టోత్తర శతఘటాభిషేకం జరిపించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గిరి ప్రదక్షిణ మహోత్సవంలో కొండ కింద గల వైకుంఠ ద్వారం వద్ద ఆలయ కార్యనిర్వాహణాధికారి భవాని శంకర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గిరి ప్రదక్షిణ చేశారు.

యాదాద్రిలో స్వాతి నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజలు.. గిరి ప్రదక్షిణ 1/9

యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

యాదాద్రిలో స్వాతి నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజలు.. గిరి ప్రదక్షిణ 2/9

అర్చకులు వేద మంత్రోచ్ఛారణల నడుమ స్వామివారికి వైభవంగా అష్టోత్తర శతఘటాభిషేకం జరిపించారు.

యాదాద్రిలో స్వాతి నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజలు.. గిరి ప్రదక్షిణ 3/9

స్వామి వారి జన్మనక్షత్రం సందర్భంగా యాదాద్రిలో గిరి ప్రదక్షిణ నిర్వహించారు.

యాదాద్రిలో స్వాతి నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజలు.. గిరి ప్రదక్షిణ 4/9

కొండ కింద గల వైకుంఠ ద్వారం వద్ద ఆలయ కార్యనిర్వాహణాధికారి భవాని శంకర్ ప్రత్యేక పూజలు చేశారు.

యాదాద్రిలో స్వాతి నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజలు.. గిరి ప్రదక్షిణ 5/9

పూజల అనంతరం భవాని శంకర్ గిరి ప్రదక్షిణ చేశారు.

యాదాద్రిలో స్వాతి నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజలు.. గిరి ప్రదక్షిణ 6/9

గిరి ప్రదక్షిణ మహోత్సవంలో వేలాది సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

యాదాద్రిలో స్వాతి నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజలు.. గిరి ప్రదక్షిణ 7/9

గోవింద నామస్మరణతో గిరి ప్రదక్షిణ చేశారు.

యాదాద్రిలో స్వాతి నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజలు.. గిరి ప్రదక్షిణ 8/9

గిరి ప్రదక్షిణలో దేవస్థాన అధికారులు, సిబ్బంది, అర్చకులు, భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.

యాదాద్రిలో స్వాతి నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజలు.. గిరి ప్రదక్షిణ 9/9

యాదగిరిగుట్ట గిరి ప్రదక్షిణలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పాల్గొన్నారు.

Updated at - Oct 12 , 2026 | 09:50 AM