కన్నుల పండుగగా యాదాద్రిలో స్వామి వారికి కోటి పుష్పార్చన..

ABN, Publish Date - Nov 20 , 2026 | 07:04 PM

కార్తీక వైభవోత్సవాల్లో భాగంగా యాదాద్రిలో కొలువుదీరిన శ్రీలక్ష్మి నరసింహ స్వామి వారికి సహస్ర నామావళి సహిత కోటి పుష్పార్చన శుక్రవారం అత్యంత వైభవంగా జరిగింది. ఈ పుష్పార్చన కోసం సేకరించిన వివిధ రకాల పుష్పాలను ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసి స్వామివారికి పూజలు చేశారు.

కన్నుల పండుగగా యాదాద్రిలో స్వామి వారికి కోటి పుష్పార్చన.. 1/8

కార్తీక వైభవోత్సవాల్లో భాగంగా యాదాద్రిలో కొలువుదీరిన శ్రీలక్ష్మి నరసింహ స్వామి వారికి సహస్ర నామావళి సహిత కోటి పుష్పార్చన శుక్రవారం అత్యంత వైభవంగా జరిగింది. ఈ పుష్పార్చన కోసం సేకరించిన వివిధ రకాల పుష్పాలను ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసి స్వామివారికి పూజలు చేశారు.

కన్నుల పండుగగా యాదాద్రిలో స్వామి వారికి కోటి పుష్పార్చన.. 2/8

శ్రీ స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి మేళతాళాలు, వేద మంత్రోచ్ఛారణల నడుమ శోభాయమానంగా ఊరేగింపు సేవ నిర్వహించారు.

కన్నుల పండుగగా యాదాద్రిలో స్వామి వారికి కోటి పుష్పార్చన.. 3/8

ఈ ఊరేగింపు ఆలయ మాడవీధుల మీదుగా కొనసాగి.. కోటి పుష్పార్చన మండప ప్రాంగణానికి చేరుకుంది. సహస్ర నామావళి పారాయణంతో కోటి పుష్పార్చన పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.

కన్నుల పండుగగా యాదాద్రిలో స్వామి వారికి కోటి పుష్పార్చన.. 4/8

ఈ పవిత్ర కార్యక్రమంలో వేద పండితులు, వేద విద్యార్థులు, దేవస్థానం సంస్కృత విద్యాపీఠం విద్యార్థులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కన్నుల పండుగగా యాదాద్రిలో స్వామి వారికి కోటి పుష్పార్చన.. 5/8

భక్తులు స్వామివారికి సమర్పించేందుకు తీసుకువచ్చిన పుష్పాలను అందజేసి పుష్పార్చనలో భాగస్వాములయ్యారు.

కన్నుల పండుగగా యాదాద్రిలో స్వామి వారికి కోటి పుష్పార్చన.. 6/8

కార్తీక మాసం సందర్భంగా యాదాద్రిలో నిర్వహిస్తున్న ప్రత్యేక పూజలతోపాటు కోటి పుష్పార్చన కార్యక్రమంతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

కన్నుల పండుగగా యాదాద్రిలో స్వామి వారికి కోటి పుష్పార్చన.. 7/8

ఈ పుష్పార్చనలో ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, పాలక మండలి చైర్మన్ మన్నే సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కన్నుల పండుగగా యాదాద్రిలో స్వామి వారికి కోటి పుష్పార్చన.. 8/8

స్వామి వారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు.

Updated at - Nov 20 , 2026 | 07:21 PM