సింహ వాహనంపై యోగ నరసింహుని అలంకారంలో మలయప్పస్వామి
ABN, Publish Date - Oct 14 , 2026 | 12:01 PM
తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభంగా జరగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు సింహ వాహనంపై యోగ నరసింహుని అలంకారంలో శ్రీ మలయప్ప స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. సింహ వాహనంపై కొలువుదీరిన స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆ దివ్యమంగళ స్వరూపుడి రూపాన్ని దర్శించుకుని భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. తిరుమాడ వీఢులు గోవింద నామస్మరణలతో మార్మోగాయి.
1/13
తిరుమలలో వైభవంగా శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు
2/13
మూడోరోజు సింహ వాహనంపై యోగ నరసింహుని అలంకారంలో మలయప్ప స్వామి భక్తులకు దర్శనమిచ్చారు.
3/13
సింహ వాహనంపై కొలువుదీరిన దివ్వ మంగళరూపాన్ని దర్శంచుకుని భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు.
4/13
ధైర్యానికి, పరాక్రమానికి ప్రతీక సింహ వాహనం. సోమరితనాన్ని వీడి కర్తవ్యనిష్ఠతో ముందుకు సాగేందుకు సింహ వాహనసేవ స్ఫూర్తినిస్తుంది.
5/13
సింహ వాహనంపై యోగ నరసింహుని అలంకారంలో శ్రీ మలయప్పస్వామివారి దివ్య దర్శనం భక్తులకు అభయం, ధైర్యం, ఆధ్యాత్మిక శక్తిని ప్రసాదించే మహోన్నత అనుభూతిని కలిగించింది.
6/13
వాహనం ముందు గజరాజులు ఠీవిగా నడుస్తుండగా, భక్త బృందాల భజనలు, కోలాటాలు, మంగళవాయిద్యాల నడుమ సింహ వాహనసేవ అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా సాగింది.
7/13
గోవింద నామస్మరణలతో మలయప్పస్వామిని భక్తులు దర్శించుకున్నారు.
8/13
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా టీటీడీ పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
9/13
వివిధ రాష్ట్రాల సంప్రదాయ కళారూపాలు శ్రీవారి సన్నిధిలో కొలువుదీరడంతో తిరుమలలో భక్తి పరిమళాలతో పాటు భారతీయ కళా వైభవం వెల్లివిరిసింది.
10/13
పలు రాష్ట్రాలకు చెందిన కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శిస్తూ శ్రీవారి భక్తులను అలరించారు.
11/13
మృదంగ నాదాలు, గజ్జెల సవ్వడులు, మేళతాళాల హోరు, లయబద్ధమైన నృత్య విన్యాసాలతో తిరుమల మాడవీధులు కళారూపాన్ని సంతరించుకున్నాయి.
12/13
గోవింద నామస్మరణలతో తిరుమాడ వీధులు మార్మోగుతున్నాయి.
13/13
యోగ నరసింహుని అలంకారంలో సింహ వాహనంపై తరలివస్తున్న శ్రీ మలయప్పస్వామివారికి ఎంతో భక్తిశ్రద్ధలతో భక్తులు హారతులు పట్టారు.
Updated at - Oct 14 , 2026 | 12:01 PM