తిరుమల బ్రహ్మోత్సవాలు.. మోహినీ అలంకారంలో మలయప్పస్వామి దర్శనం
ABN, Publish Date - Oct 16 , 2026 | 12:06 PM
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఐదోరోజు మోహినీ అలంకారంలో జగన్మోహనాకారుడిగా శ్రీ మలయప్పస్వామి భక్తులకు దర్శనమిచ్చారు. మరో తిరుచ్చిపై శ్రీకృష్ణస్వామివారు అలంకృతులై భక్తులకు అభయమిచ్చారు. గజరాజులు ముందు నడుస్తుండగా, భక్తజన బృందాల భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి పల్లకీసేవ వైభవంగా సాగింది. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పిస్తూ శ్రీవారిని దర్శించుకుని భక్తిపారవశ్యంలో మునిగిపోయారు.
1/13
తిరుమల శ్రీవేకంటేశ్వర స్వామి ఆలయంలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి
2/13
ఐదోరోజు మోహినీ అలంకారంలో జగన్మోహనాకారుడిగా శ్రీ మలయప్పస్వామి భక్తులకు దర్శనమిచ్చారు.
3/13
మరో తిరుచ్చిపై శ్రీకృష్ణస్వామివారు అలంకృతులై భక్తులకు అభయమిచ్చారు
4/13
గజరాజులు ముందు నడుస్తుండగా, భక్తజన బృందాల భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి పల్లకీసేవ వైభవంగా సాగింది.
5/13
మోహినీ అవతారం.. మాయామోహాల నుంచి విముక్తికి సందేశం
6/13
మోహినీ అవతారం జగత్తును ఆవహించిన మాయామోహాలకు అతీతంగా భగవంతుని తత్త్వాన్ని గ్రహించాలనే ఆధ్యాత్మిక సందేశాన్ని అందిస్తుంది.
7/13
సమస్త జగత్తు భగవంతుని లీలా విలాసమని, ఆయన అనుగ్రహంతోనే మాయామోహాలను అధిగమించి ఆధ్యాత్మిక ఉన్నతిని పొందగలమనే తత్త్వాన్ని ఈ అవతారం చాటిచెబుతుంది.
8/13
అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పిస్తూ శ్రీవారిని దర్శించుకుని భక్తిపారవశ్యంలో మునిగిపోయారు.
9/13
మోహినీ అలంకారంలో జగన్మోహనాకారుడిగా దర్శనమిస్తున్న శ్రీ మలయప్పస్వామిని చూసి భక్తులు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు.
10/13
గోవింద నామస్మరణతో తిరుమాడ వీధులు మార్మోగాయి.
11/13
మలయప్ప స్వామి ముందు వివిధ నృత్య ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
12/13
తిరుమలలో పలువురు కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శిస్తూ శ్రీవారి భక్తులను అలరించారు.
13/13
ఈ కార్యక్రమంలో పెద్దజీయర్ స్వామి, చినజీయర్ స్వామి, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులు పనబాక లక్ష్మి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, జానకీ దేవి, రంగశ్రీ, ఆనంద సాయి, దర్శన్, నరేష్ కుమార్, ఎన్. సదాశివరావు, జేఈవోలు డా.ఎ.శరత్, ప్రభల గోపీనాథ్, సీవీఎస్వో మురళీకృష్ణ, ఎస్పీ సుబ్బరాయుడు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Updated at - Oct 16 , 2026 | 12:13 PM