అంతర్వేదిలో కమనీయంగా స్వామి వారి కల్యాణం..
ABN, Publish Date - Jan 29 , 2026 | 10:28 AM
తెలుగు రాష్ట్రాల్లో నవ నారసింహ క్షేత్రాలు కొలువుదీరాయి. అందులో ఒకటి అంతర్వేదిలోని శ్రీలక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఈ క్షేత్రంలో స్వామి వారి తిరుకల్యాణ మహోత్సవాలు జనవరి 25వ తేదీ.. రథసప్తమి రోజు ప్రారంభమయ్యాయి.
1/6
తెలుగు రాష్ట్రాల్లో నవ నారసింహ క్షేత్రాలు కొలువుదీరాయి. అందులో ఒకటి అంతర్వేదిలోని శ్రీలక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఈ క్షేత్రంలో స్వామి వారి తిరుకల్యాణ మహోత్సవాలు జనవరి 25వ తేదీ.. రథసప్తమి రోజు ప్రారంభమయ్యాయి. ఇవి మాఘ బహుళ పాడ్యమి రోజు.. అంటే ఫిబ్రవరి 2వ తేదీతో ముగియనున్నాయి.
2/6
ఈ మహోత్సవాల్లో భాగంగా స్వామి వారి కళ్యాణం జనవరి 28వ తేదీన అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ మహోత్సవాల సందర్భంగా అంతర్వేదికి స్వామి వారి భక్తులు పోటెత్తారు.
3/6
దేవదేవుళ్లకు వివిధ మాసాలు ప్రీతికరమని అందరికి తెలిసిందే. ప్రత్యక్ష నారాయణుడు.. సూర్య భగవానుడికి మాఘ మాసం అత్యంత ఇష్టమైనది. అందుకే రథసప్తమి తిథి నుంచి అంతర్వేదిలో తిరుకల్యాణోత్సవాలు ప్రారంభమై.. వరుసగా తొమ్మిది రోజుల పాటు జరుగుతున్నాయి.
4/6
మాఘ శుద్ధ దశమి రోజు అంటే జనవరి 28వ తేదీ రాత్రి మృగశిరా నక్షత్ర యుక్త వృశ్చిక లగ్నంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి కల్యాణం నిర్వహించారు.
5/6
భీష్మ ఏకాదశి అంటే.. ఈ రోజు నూతన వధూవరులైన శ్రీ స్వామి, అమ్మవార్లను రథంపై ఊరేగించనున్నారు.
6/6
శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి కమనీయ కల్యాణాన్ని వీక్షించేందుకు భారీగా తరలి రావడంతో అంతర్వేది క్షేత్రం భక్తులతో నిండిపోయింది. ఈ అంతర్వేది వద్దే వశిష్ట గోదావరి నది బంగాళాఖాతంలో కలుస్తుంది.
Updated at - Jan 29 , 2026 | 10:31 AM