ఐదో రోజు కాళేశ్వరంలో కొనసాగుతున్న పుష్కరాలు..
ABN, Publish Date - May 25 , 2026 | 04:02 PM
ప్రముఖ పుణ్య క్షేత్రమైన కాళేశ్వరంలో సరస్వతి నది అంత్య పుష్కరాలు వైభవంగా కొనసాగుతున్నాయి. సోమవారం ఈ పుష్కరాలు ఐదో రోజుకు చేరుకున్నాయి. త్రివేణి సంగమ క్షేత్రానికి భక్తుల తాకిడి విపరీతంగా పెరిగింది.
1/12
ప్రముఖ పుణ్య క్షేత్రమైన కాళేశ్వరంలో సరస్వతి నది అంత్య పుష్కరాలు వైభవంగా కొనసాగుతున్నాయి.
2/12
సోమవారం ఈ పుష్కరాలు ఐదో రోజుకు చేరుకున్నాయి.
3/12
త్రివేణి సంగమ క్షేత్రానికి భక్తుల తాకిడి విపరీతంగా పెరిగింది.
4/12
తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా.. కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు కాళేశ్వరానికి తరలి వస్తున్నారు.
5/12
పవిత్ర త్రివేణి సంగమంలో స్నానం ఆచరించి.. నదీ తీరంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
6/12
పుష్కరాల సందర్భంగా భక్తులు నదిలో దీపాలు వదులుతూ, పితృ దేవతలకు పిండ ప్రదానాలతోపాటు తర్పణాలు వదులుతున్నారు.
7/12
అలాగే నదీ తల్లికి అర్ఘ్య ప్రదానాలు చేసి మొక్కులు తీర్చుకుంటున్నారు.
8/12
పుష్కర ఘాట్ సమీపంలో ఏర్పాటు చేసిన సరస్వతి దేవి విగ్రహాన్ని దర్శించుకుని ప్రత్యేక హారతులు ఇస్తున్నారు.
9/12
ఈ పుష్కర స్నానాలు అనంతరం కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలో కొలువుదీరిన స్వామి వారిని దర్శించుకుంటున్నారు.
10/12
స్వామి వారి దర్శనం కోసం భారీగా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీ నేపథ్యంలో అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
11/12
ఈ పుష్కరాలకు తరలి వచ్చే భక్తులకు తాగునీరు, శానిటేషన్, వైద్య సేవలతోపాటు భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ వెల్లడించారు.
12/12
వేసవి కావడంతో.. ఎండల వేడికి ఎటువంటి అనారోగ్యానికి గురైతే.. 108కి ఫోన్ చేయాలని పుష్కరాలకు వచ్చే భక్తులకు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.
Updated at - May 25 , 2026 | 05:15 PM