మేడారంలో ఘనంగా తిరుగువారం.. పోటెత్తిన భక్తులు
ABN, Publish Date - Feb 04 , 2026 | 08:41 PM
తెలంగాణ కుంభమేళగా ప్రసిద్ధిగాంచిన మేడారం జాతర అనంతరం నిర్వహించే సంప్రదాయంలో భాగంగా బుధవారం తిరుగువారం పండగ ఘనంగా నిర్వహించారు. ఈ జాతర ముగిసిన వారం రోజులకు ఈ తిరుగువారం పండగ నిర్వహిస్తారు. గిరిజన పూజారులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
1/11
తెలంగాణ కుంభమేళగా ప్రసిద్ధిగాంచిన మేడారం జాతర అనంతరం నిర్వహించే సంప్రదాయంలో భాగంగా బుధవారం (04-02-2026) తిరుగువారం పండగ ఘనంగా నిర్వహించారు.
2/11
ఈ జాతర ముగిసిన వారం రోజులకు ఈ తిరుగువారం పండగ నిర్వహిస్తారు. గిరిజన పూజారులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
3/11
ములుగు జిల్లా తడ్వాయి మండలం మేడారం కన్నపల్లిలోని సమ్మక్క సారాలమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు.
4/11
గిరిజన పూజారులు ఈ రోజు ఉదయం నుంచే తమ కుటుంబ సమేతంగా ఆలయాలకు చేరుకున్నారు.
5/11
అమ్మవారి గెద్దలతోపాటు ఆలయ పరిసరాలను పసుపు నీళ్ల, ఆవు పేడతో శుద్ది చేశారు.
6/11
అమ్మవారి గెద్దలపై గిరిజన పూజారులు సంప్రదాయ పద్దతిలో పూజలు చేశారు.
7/11
పూజారులు ఆలయం చుట్టు ప్రదక్షణలు చేసి.. అమ్మవార్లకు దీపదూప నైవేద్యాలు సమర్పించారు.
8/11
అమ్మవార్లకు భక్తులు యేటలను బలి ఇచ్చి తమ మొక్కులు చెల్లించుకున్నారు.
9/11
ప్రతి రెండేళ్లకు ఒక సారి ఈ సమ్మక్క సారాలమ్మ జాతర జరుగుతుంది.
10/11
ఈ ఏడాది దాదాపు రెండు కోట్ల మంది భక్తులు ఈ సమ్మక్క సారాలమ్మ జాతరకు విచ్చేసినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు.
11/11
తిరుగువారం కారణంగా.. మేడారం పరిసర ప్రాంతాల్లోని రహదార్లపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
Updated at - Feb 04 , 2026 | 09:02 PM