భక్తిశ్రద్ధలతో రథసప్తమి.. ఆలయాలకు పోటెత్తిన భక్తజనం..

ABN, Publish Date - Jan 25 , 2026 | 09:25 PM

రథసప్తమి సందర్భంగా దేవుని కడప, శ్రీకాకుళం జిల్లాలోని శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా రథోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

భక్తిశ్రద్ధలతో రథసప్తమి.. ఆలయాలకు పోటెత్తిన భక్తజనం..  1/8

తిరుమల తొలి గడపగా ప్రసిద్ధి చెందిన దేవుని కడపలోని లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో టీటీడీ ఆధ్వర్యంలో రథోత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మాఘ మాసంలో ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అలాగే రథసప్తమి రోజున ఇక్కడ నిర్వహించే రథోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తుంటారు.

భక్తిశ్రద్ధలతో రథసప్తమి.. ఆలయాలకు పోటెత్తిన భక్తజనం..  2/8

ఈ ఏడాది దేవుని కడపలో 18వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. 18వ తేదీన అంకురార్పణ, 19న ధ్వజారోహణం, 23న గరుడ వాహనం, 24న కళ్యాణోత్సవం, 25న రథసప్తమి సందర్భంగా ధూళి ఉత్సవంతో పాటూ రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

భక్తిశ్రద్ధలతో రథసప్తమి.. ఆలయాలకు పోటెత్తిన భక్తజనం..  3/8

స్వామివారు భక్తుల మధ్య భారీ రథంపై ఊరేగారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామి వారిని దర్శించుకున్నారు. అన్నమయ్య సంకీర్తనల్లో కూడా ఈ రథోత్సవ వైభవాన్ని వర్ణించారు.

భక్తిశ్రద్ధలతో రథసప్తమి.. ఆలయాలకు పోటెత్తిన భక్తజనం..  4/8

రథోత్సవాన్ని వీక్షించేందుకు కడప జిల్లాతో పాటూ చుట్టు పక్క ప్రాంతాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. చిన్నారులు, యువత, వృద్ధులు అందరూ ఉత్సవంలో పాల్గొన్నారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ ఏర్పాట్లు చేసింది.

భక్తిశ్రద్ధలతో రథసప్తమి.. ఆలయాలకు పోటెత్తిన భక్తజనం..  5/8

ఉత్సవంలో భాగంగా స్వామి, అమ్మవార్లకు విశేష అలంకరణ చేశారు. అలాగే రథాన్ని పుష్పాలు, విద్యుత్ దీపాలు, రంగురంగుల వస్త్రాలతో అందంగా అలంకరించారు. భక్తుల గోవింద నామస్మరణతో ఆ ప్రాంతం మారుమ్రోగింది.

భక్తిశ్రద్ధలతో రథసప్తమి.. ఆలయాలకు పోటెత్తిన భక్తజనం..  6/8

రథ సప్తమి సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయానికి భక్తులు భారీగా పోటెత్తారు.

భక్తిశ్రద్ధలతో రథసప్తమి.. ఆలయాలకు పోటెత్తిన భక్తజనం..  7/8

రథసప్తమి ఆదివారం రోజు జరగడంతో మరింత అదృష్టకరంగా భావించి.. భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. అధికారుల అంచనా ప్రకారం 2 లక్షలకు పైగా భక్తులు దర్శించుకున్నట్లు సమాచారం.

భక్తిశ్రద్ధలతో రథసప్తమి.. ఆలయాలకు పోటెత్తిన భక్తజనం..  8/8

భక్తుల రద్దీ విపరీతంగా ఉండడంతో ఆలయ కమిటీ అదనపు క్యూ లైన్లు ఏర్పాటు చేసింది. భక్తులకు ప్రసాదం, ఆహార ప్యాకెట్లు వంటి సేవలు అందించడానికి పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చాయి.

Updated at - Jan 25 , 2026 | 09:27 PM