తంగెళ్లమూడిలో ఘనంగా ముగిసిన గంగానమ్మ జాతర..

ABN, Publish Date - Feb 10 , 2026 | 04:10 PM

ఏలూరు నగరంలో గత మూడు నెలలుగా భక్తుల నుంచి విశేష పూజలందుకున్న శ్రీగంగానమ్మ అమ్మవారికి సోమవారం నగర ప్రజలు ఘనంగా వీడ్కోలు పలికారు. తూర్పు వీధి, దక్షిణపు వీధి, పవర్ పేట, లక్ష్మీవారపుపేట, ఆదివారపుపేటలతో పాటు పడమర వీధిల్లో గత100 రోజులుగా కొలిచిన అమ్మవారిని జనవరి 26, ఫిబ్రవరి 2వ తేదీల్లో సాగనంపారు.

తంగెళ్లమూడిలో ఘనంగా ముగిసిన గంగానమ్మ జాతర.. 1/13

ఏలూరు నగరంలో గత మూడు నెలలుగా భక్తుల నుంచి విశేష పూజలందుకున్న శ్రీగంగానమ్మ అమ్మవారికి సోమవారం నగర ప్రజలు ఘనంగా వీడ్కోలు పలికారు.

తంగెళ్లమూడిలో ఘనంగా ముగిసిన గంగానమ్మ జాతర.. 2/13

తూర్పు వీధి, దక్షిణపు వీధి, పవర్ పేట, లక్ష్మీవారపుపేట, ఆదివారపుపేటలతో పాటు పడమర వీధిల్లో గత100 రోజులుగా కొలిచిన అమ్మవారిని జనవరి 26, ఫిబ్రవరి 2వ తేదీల్లో సాగనంపారు.

తంగెళ్లమూడిలో ఘనంగా ముగిసిన గంగానమ్మ జాతర.. 3/13

తంగెళ్లమూడి ప్రాంతంలో చివరి సారిగా అమ్మవారికి సోమవారం (09-02-2026) వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు.

తంగెళ్లమూడిలో ఘనంగా ముగిసిన గంగానమ్మ జాతర.. 4/13

తంగెళ్లమూడిలో ఏర్పాటు చేసిన శ్రీగంగానమ్మ అమ్మవారి మేడల నుంచి అమ్మవారిని కొర్లబండిపై నగర శివార్లకు సాగనంపే ప్రక్రియ నేత్రపర్వంగా సాగింది.

తంగెళ్లమూడిలో ఘనంగా ముగిసిన గంగానమ్మ జాతర.. 5/13

ఊరేగింపులో కొర్లబడిపై అమ్మవారి వేషధారణలో పంబల వారు కూర్చొని భక్తులకు కుంకుమబొట్లు పెడుతూ ఆశీర్వదిస్తూ ముందుకు సాగారు.

తంగెళ్లమూడిలో ఘనంగా ముగిసిన గంగానమ్మ జాతర.. 6/13

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేషధారణలు భక్తులను ఆకట్టుకున్నాయి.

తంగెళ్లమూడిలో ఘనంగా ముగిసిన గంగానమ్మ జాతర.. 7/13

ప్రతి ఏడేళ్లకు ఒకసారి ఈ గంగానమ్మ జాతరను ఏలూరులో నిర్వహిస్తారు.

తంగెళ్లమూడిలో ఘనంగా ముగిసిన గంగానమ్మ జాతర.. 8/13

దాదాపు మూడు నెలల పాటు ఈ జాతర జరుగుతుంది.

తంగెళ్లమూడిలో ఘనంగా ముగిసిన గంగానమ్మ జాతర.. 9/13

ఈ జాతర కారణంగా.. ఏలూరుతోపాటు పరిసర ప్రాంతాల్లో వివాహాది శుభకార్యాలు నిర్వహించరు.

తంగెళ్లమూడిలో ఘనంగా ముగిసిన గంగానమ్మ జాతర.. 10/13

కొన్ని శతాబ్దాలుగా ఈ ఆచారం కొనసాగుతోంది.

తంగెళ్లమూడిలో ఘనంగా ముగిసిన గంగానమ్మ జాతర.. 11/13

గ్రామదేవత గంగానమ్మను ఊరి పొలిమేరల్లోకి సాగనంపారు. ఈ సందర్భంగా ఏలూరు పరిసర ప్రాంతాల నుంచి ప్రజలు భారీగా తరలి వచ్చారు.

తంగెళ్లమూడిలో ఘనంగా ముగిసిన గంగానమ్మ జాతర.. 12/13

ఈ కార్యక్రమంలో పాల్గొన్న వేషధారణలో పార్వతీ పరమేశ్వర్లు.

తంగెళ్లమూడిలో ఘనంగా ముగిసిన గంగానమ్మ జాతర.. 13/13

గంగానమ్మ జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలు విశేషంగా ఆకట్టుకున్నాయి.

Updated at - Feb 10 , 2026 | 04:10 PM