సందడిగా తెలుగు రాష్ట్రాల్లో గణేశ్ నిమజ్జనం..

ABN, Publish Date - Sep 23 , 2026 | 08:55 PM

తెలుగు రాష్ట్రాల్లో గణేశ్ నిమజ్జనం సందడి హోరత్తింది. వినాయక చవితి ఉత్సవాల అనంతరం గణనాథుడి నిమజ్జనానికి భక్తులు భారీగా తరలివచ్చారు.

సందడిగా తెలుగు రాష్ట్రాల్లో గణేశ్ నిమజ్జనం.. 1/16

తెలుగు రాష్ట్రాల్లో గణేశ్ నిమజ్జనం సందడి హోరత్తింది.

సందడిగా తెలుగు రాష్ట్రాల్లో గణేశ్ నిమజ్జనం.. 2/16

వినాయక చవితి ఉత్సవాల అనంతరం గణనాథుడి నిమజ్జనానికి భక్తులు భారీగా తరలివచ్చారు.

సందడిగా తెలుగు రాష్ట్రాల్లో గణేశ్ నిమజ్జనం.. 3/16

పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నప్పటికీ భక్తుల ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు.

సందడిగా తెలుగు రాష్ట్రాల్లో గణేశ్ నిమజ్జనం.. 4/16

డప్పుల మోతలు, భక్తిగీతాలు, కోలాటాలు, నృత్యాలతో నిమజ్జన శోభయాత్ర ఘనంగా సాగింది.

సందడిగా తెలుగు రాష్ట్రాల్లో గణేశ్ నిమజ్జనం.. 5/16

రాజమండ్రి, కాకినాడతోపాటు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో గణేశ్ నిమజ్జన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.

సందడిగా తెలుగు రాష్ట్రాల్లో గణేశ్ నిమజ్జనం.. 6/16

ప్రధాన రహదారులు గణనాథుడి శోభాయాత్రలతో సందడిగా మారాయి.

సందడిగా తెలుగు రాష్ట్రాల్లో గణేశ్ నిమజ్జనం.. 7/16

యువత, మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని బొజ్జగణపయ్యకు వీడ్కోలు పలికారు.

సందడిగా తెలుగు రాష్ట్రాల్లో గణేశ్ నిమజ్జనం.. 8/16

మాదాపూర్ దుర్గం చెరువు పరిసరాల్లోనూ గణేశ్ నిమజ్జన సందడి హోరెత్తింది.

సందడిగా తెలుగు రాష్ట్రాల్లో గణేశ్ నిమజ్జనం.. 9/16

భారీ విగ్రహాలతోపాటు పర్యావరణహిత గణపతుల నిమజ్జనానికి భక్తులు ప్రాధాన్యత ఇచ్చారు.

సందడిగా తెలుగు రాష్ట్రాల్లో గణేశ్ నిమజ్జనం.. 10/16

ముసాపేట్ అంజయ్య నగర్‌లో పర్యావరణ పరిరక్షణకు సందేశమిచ్చేలా ప్రత్యేకంగా తయారు చేసిన మట్టి గణపతిని భక్తులు ఊరేగింపుగా తీసుకెళ్లారు.

సందడిగా తెలుగు రాష్ట్రాల్లో గణేశ్ నిమజ్జనం.. 11/16

పంచగవ్యాలు, బంకమట్టి, ఆవు పేడతో తయారు చేసిన ఈ పర్యావరణహిత గణపతి నిమజ్జన శోభాయాత్రలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

సందడిగా తెలుగు రాష్ట్రాల్లో గణేశ్ నిమజ్జనం.. 12/16

సంప్రదాయ పద్దతుల్లో తయారు చేసిన విగ్రహాన్ని దీపాలతో అలంకరించి, భక్తి పాటలు, కోలాటాల మధ్య ఊరేగిస్తూ తీసుకెళ్లారు.

సందడిగా తెలుగు రాష్ట్రాల్లో గణేశ్ నిమజ్జనం.. 13/16

వర్షాలు కురుస్తున్నా భక్తులు వెనక్కి తగ్గకుండా నిమజ్జన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

సందడిగా తెలుగు రాష్ట్రాల్లో గణేశ్ నిమజ్జనం.. 14/16

తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి ప్రారంభమైన శోభాయాత్రలు రాత్రి వరకు కొనసాగాయి.

సందడిగా తెలుగు రాష్ట్రాల్లో గణేశ్ నిమజ్జనం.. 15/16

డప్పులు, బ్యాండ్లు, కోలాటాలు, భక్తి నినాదాలతో వీధులు మార్మోగాయి.

సందడిగా తెలుగు రాష్ట్రాల్లో గణేశ్ నిమజ్జనం.. 16/16

పలుచోట్ల పోలీసులు, మున్సిపల్ అధికారులు, స్థానిక నిర్వాహకులు సమన్వయంతో ఏర్పాట్లు చేశారు.

Updated at - Sep 23 , 2026 | 09:28 PM