శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రంలో తిరుకల్యాణ మహోత్సవం
ABN, Publish Date - Feb 01 , 2026 | 07:38 AM
యాదగిరిగుట్ట దేవస్థానానికి అనుబంధ ఆలయమైన పూర్వగిరి (పాతగుట్ట) శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శనివారం తిరుకల్యాణ మహోత్సవం జరిగింది.
1/9
యాదగిరిగుట్ట దేవస్థానానికి అనుబంధ ఆలయమైన పూర్వగిరి (పాతగుట్ట) శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.
2/9
శనివారం తిరుకల్యాణ మహోత్సవం జరిగింది. ఈ మహోత్సవానికి జిల్లా కలెక్టర్ హనుమంతరావు, ఆలయ ఈవో భవానీ శంకర్ హాజరయ్యారు.
3/9
ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం అంటే.. జనవరి 28వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి.
4/9
ఆ రోజు ఉదయం స్వస్తివాచనం, రక్షాబంధనం, విష్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనంతో ఆలయ ఆర్చకులు వార్షిక బ్రహోత్సవాలకు శ్రీకారం చుట్టారు.
5/9
ఈ మహోత్సవాల్లో భాగంగా 30న స్వామి వారి ఎదుర్కోలు మహోత్సవం, 31న తిరుకల్యాణ మహోత్సవం జరిగాయి.
6/9
ఇక ఫిబ్రవరి 1వ తేదీ అంటే ఈ రోజు దివ్య విమాన రథోత్సవం జరగనుంది. ఈ వార్షిక బ్రహ్మోత్సవాలకు తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు పోటెత్తారు.
7/9
ఇక వార్షిక బ్రహోత్సవాల్లో భాగంగా పలు సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించారు. ఇవి భక్తులను ఆకట్టుకున్నాయి.
8/9
ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా.. ఆలయ పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
9/9
సామాన్య భక్తులు భారీగా తరలి వస్తుండడంతో.. వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా పోలీసులు, ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు.
Updated at - Feb 01 , 2026 | 08:24 AM