విజయసాయిరెడ్డి కొత్త పార్టీ పీఆర్పీ ఆవిర్భావం

ABN, Publish Date - Nov 11 , 2026 | 12:57 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కొత్త పార్టీ ఆవిర్భవించింది. పరివర్తన రాజనీతి పార్టీ పేరుతో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కొత్త పార్టీని ప్రకటించారు.

  విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  పీఆర్పీ ఆవిర్భావం 1/6

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కొత్త పార్టీ ఆవిర్భవించింది. పరివర్తన రాజనీతి పార్టీ పేరుతో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కొత్త పార్టీని ప్రకటించారు.

  విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  పీఆర్పీ ఆవిర్భావం 2/6

పార్టీ జెండా మధ్యలో ధర్మచక్రం గుర్తు, తెలుపు, కాషాయ రంగులో ఉండేలా పార్టీ జెండాను ఆయన రూపొందించారు.

  విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  పీఆర్పీ ఆవిర్భావం 3/6

ఈ సందర్భంగా పరివర్తన రాజనీతి పార్టీ అధినేత విజయసాయి రెడ్డి ప్రసంగించారు. దేవతల సాక్షిగా రాజకీయ పార్టీని ప్రారంభించానని స్పష్టం చేశారు.

  విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  పీఆర్పీ ఆవిర్భావం 4/6

మార్పు అన్నది ప్రజలే తీసుకురావాలని ఆకాంక్షించారు. ఏపీ భవిష్యత్తు ఏ నాయకుడు చేతుల్లో లేదని.. ప్రజల చేతుల్లో ఉందని వ్యాఖ్యానించారు. అధికార, ప్రతిపక్షాలు రెండు తప్పు చేస్తున్నాయని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు.

  విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  పీఆర్పీ ఆవిర్భావం 5/6

నిజం, లెక్క, ప్రజల అవసరాలు అధికార, ప్రతిపక్షాలకి కనబడటం లేదని తెలిపారు. తప్పు ఎవరు చేసిన ప్రశ్నించాల్సిందేనని అన్నారు. ప్రశ్నించడం ప్రజల హక్కు అని చెప్పారు. పీఆర్పీ అంటే మీలోని నాయకత్వ లక్షణాలను పైకి తీసుకురావడమే తమ పార్టీ లక్ష్యమని ఉద్ఘాటించారు.

  విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  పీఆర్పీ ఆవిర్భావం 6/6

ఐదు కోట్ల ఆంధ్ర ప్రజలను రెండు కుటుంబాలే శాసిస్తున్నాయని తెలిపారు. ఆ రెండు కుటుంబాలే శాసించాలా.. ఆ కుటుంబాల ఆధిపత్యం వద్దని విజయ సాయిరెడ్డి పేర్కొన్నారు. ఆ రెండు కుటుంబాల నుంచే సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు కావాలా అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.

Updated at - Nov 11 , 2026 | 01:11 PM