వెలిగొండ ప్రాజెక్ట్ ఫేజ్-1 ప్రారంభం.. జాతికి అంకితం చేసిన సీఎం చంద్రబాబు
ABN, Publish Date - Aug 31 , 2026 | 04:50 PM
వెలిగొండ ప్రాజెక్ట్ ఫేజ్-1ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గం గంటవానిపల్లి సమీపంలో వెలిగొండ ఫీడర్ కెనాల్ వద్ద కృష్ణాజలాలకు సీఎం జలహారతి ఇచ్చారు. నీళ్లలోకి దిగి కృష్ణమ్మకు హారతి ఇచ్చి పసుపు, కుంకుమ, చీరను సమర్పించారు. వెలిగొండ ప్రాజెక్ట్ పైలాన్‌ను ఆవిష్కరించి జాతికి అంకితం చేశారు. సీఎం చంద్రబాబు.. రైతులతో బటన్ నొక్కించి వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ వద్ద గేట్లు ఎత్తించి నల్లమలసాగర్‌కు నీటిని విడుదల చేశారు. జలహారతి ఇచ్చే ప్రదేశం వద్ద గిరిజన మహిళలు, చిన్నారులు లంబాడా నృత్యం అందరినీ ఆకట్టుకుంది.
1/13
మార్కాపురం జిల్లాలో వెలిగొండ ప్రాజెక్ట్ ఫేజ్-1 ప్రారంభం
2/13
వెలిగొండ ప్రాజెక్ట్ ఫేజ్-1ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు నాయుడు.
3/13
ఎర్రగొండపాలెం నియోజకవర్గం గంటవానిపల్లి సమీపంలో వెలిగొండ ఫీడర్ కెనాల్ వద్ద కృష్ణాజలాలకు సీఎం చంద్రబాబు జలహారతి.
4/13
పంచె కట్టుతో సాంప్రదాయంగా పూజా కార్యక్రమంలో పాల్గొన్న సీఎం.. కృష్ణమ్మకు జలహారతి ఇచ్చి, నీటిని తలపై చల్లుకున్నారు.
5/13
నీళ్లల్లోకి దిగి కృష్ణమ్మకు హారతి ఇచ్చి పసుపు, కుంకుమ, చీరను సమర్పించిన సీఎం.
6/13
జలహారతి ఇచ్చిన అనంతరం కెనాల్ ఒడ్డున కృష్ణమ్మకు సాష్టాంగ ప్రణామం చేసిన సీఎం చంద్రబాబు
7/13
వెలిగొండ ప్రాజెక్టు పైలాన్‌ను ఆవిష్కరించి.. జాతికి అంకితం చేసిన సీఎం చంద్రబాబు.
8/13
వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ వద్ద గేట్లు ఎత్తి నీటిని నల్లమల సాగర్‌కు విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. స్థానిక రైతులతో బటన్ నొక్కించి గేట్లు ఎత్తించిన సీఎం.
9/13
వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ నుంచి పరవళ్లు తొక్కుతూ నల్లమల సాగర్ వైపు మళ్లిన కృష్ణా జలాలు.
10/13
జలహారతి ఇచ్చే ప్రదేశం వద్ద గిరిజన మహిళలు, చిన్నారులు లంబాడా నృత్యం అందరినీ ఆకట్టుకుంది.
11/13
కెనాల్ వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబుకు అభివాదం చేస్తున్న రైతులు, మహిళలు.
12/13
వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవంలో మంత్రులు నిమ్మల రామానాయుడు, గొట్టి పాటిరవికుమార్, డీబీవీ స్వామి, ఆనం రామనారాయణరెడ్డి, కందుల దుర్గేష్, అనగాని సత్యప్రాద్, పార్ధసారధి, ఎంపీ శ్రీనివాసరెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్, జిల్లా ప్రజాప్రతినిధులు, నేతలు, అధికారులు పాల్గొన్నారు.
13/13
వెలిగొండ ప్రాజెక్ట్ వద్ద కళాకారులతో సీఎం చంద్రబాబు ఫొటో..
Updated at - Aug 31 , 2026 | 05:07 PM