ఏపీలో మరో రెండు భారీ ప్రాజెక్టులు.. రూ.29,500 కోట్ల పెట్టుబడులకు రెన్యూ ఒప్పందం

ABN, Publish Date - Nov 12 , 2026 | 09:36 AM

విశాఖపట్నంలో రెన్యూ ఛైర్మన్ అండ్ సీఈవో సుమంత్ సిన్హాతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ సమావేశమయ్యారు. రెన్యూ సంస్థ రాష్ట్రంలో పలుచోట్ల రెన్యువబుల్ ఎనర్జీ రంగంలో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టడంపై మంత్రి అభినందనలు తెలిపారు. లోకేశ్‌తో చర్చల అనంతరం మరో రెండు భారీ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టేందుకు సుమంత్ సిన్హా సుముఖత వ్యక్తంచేశారు. మంత్రి సమక్షంలో రెన్యూ ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు మధ్య ఒప్పందం జరిగింది.

ఏపీలో మరో రెండు భారీ ప్రాజెక్టులు.. రూ.29,500 కోట్ల పెట్టుబడులకు రెన్యూ ఒప్పందం 1/6

విశాఖపట్నంలో రెన్యూ ఛైర్మన్ అండ్ సీఈవో సుమంత్ సిన్హాతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ సమావేశం. రెన్యూ సంస్థ రాష్ట్రంలో పలుచోట్ల రెన్యువబుల్ ఎనర్జీ రంగంలో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టడంపై మంత్రి అభినందనలు.

ఏపీలో మరో రెండు భారీ ప్రాజెక్టులు.. రూ.29,500 కోట్ల పెట్టుబడులకు రెన్యూ ఒప్పందం 2/6

లోకేశ్‌తో చర్చల అనంతరం మరో రెండు భారీ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టేందుకు సుమంత్ సిన్హా సుముఖత వ్యక్తంచేశారు. మంత్రి సమక్షంలో రెన్యూ ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు మధ్య ఒప్పందం కుదిరింది.

ఏపీలో మరో రెండు భారీ ప్రాజెక్టులు.. రూ.29,500 కోట్ల పెట్టుబడులకు రెన్యూ ఒప్పందం 3/6

ఏపీలో కొత్తగా 2గిగావాట్ల పంప్డ్ స్టోరేజి ప్రాజెక్టులో రూ.12,500 కోట్లు, గ్రీన్ అమ్మోనియా/ఈ-ఫ్యూయల్ ప్రాజెక్టులో రూ.17,000 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు రెన్యూ ఛైర్మన్ అండ్ సీఈవో సుమంత్ సిన్హా వెల్లడి.

ఏపీలో మరో రెండు భారీ ప్రాజెక్టులు.. రూ.29,500 కోట్ల పెట్టుబడులకు రెన్యూ ఒప్పందం 4/6

మరో రూ.11వేల కోట్ల విలువైన పాలి సిలికాన్, మెటలర్జికల్ గ్రేడ్ సిలికాన్ ప్రాజెక్టు కూడా ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసేందుకు సూత్రప్రాయ అంగీకారం తెలిపినందుకు మంత్రి లోకేశ్ అభినందనలు తెలియజేశారు. ప్రాజెక్టులను వేగవంతం చేయాలని విజ్ఞప్తి.

ఏపీలో మరో రెండు భారీ ప్రాజెక్టులు.. రూ.29,500 కోట్ల పెట్టుబడులకు రెన్యూ ఒప్పందం 5/6

ప్రాజెక్టుల గ్రౌండింగ్‌కు అవసరమైన పూర్తి సహాయ, సహకారాలను ఏపీ ప్రభుత్వం అందిస్తుందన్న లోకేశ్. యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ (UNSW) సహకారంతో తిరుపతి ఐఐటీలో ఏర్పాటు చేయబోయే సోలార్ సెల్ ప్రోటోటైపింగ్ కేంద్రం ఏర్పాటులో భాగస్వామ్యం వహించాల్సిందిగా లోకేశ్ కోరారు.

ఏపీలో మరో రెండు భారీ ప్రాజెక్టులు.. రూ.29,500 కోట్ల పెట్టుబడులకు రెన్యూ ఒప్పందం 6/6

రెన్యూ సంస్థ ఏపీలో 2015 నుంచే వివిధ ప్రాజెక్టులను నిర్వహిస్తోందని ఛైర్మన్ సుమంత్ సిన్హా చెప్పారు. 2015లో మొదటి 24 మెగావాట్ల విండ్ ప్రాజెక్ట్ కళ్యాణదుర్గంలో ఏర్పాటుచేశామని, ప్రస్తుతం 10 ప్రాంతాల్లో 717 మెగావాట్ల విండ్, 60 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టులను నిర్వహిస్తున్నట్లు సుమంత్ సిన్హా తెలిపారు.

Updated at - Nov 12 , 2026 | 09:39 AM